
విరాట్ కోహ్లి
కేప్‌టౌన్: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. బ్యాట్ పడితే చాలు మంచి నీళ్లు ప్రాయంలా ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లి.. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో రికార్డుల పంట పండించాడు. వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత కెప్టెన్‌గా కోహ్లి ఘనత సాధించాడు. నిన్నటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా 12వ వన్డే శతకాన్ని సాధించిన కోహ్లి.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(11) రికార్డును అధిగమించాడు. భారత కెప్టెన్‌గా అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఘనత కూడా కోహ్లి(14 సెంచరీలు) పేరిటే ఉంది.
మరొకవైపు వన్డేల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఎనిమిదో భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. సఫారీలతో మ్యాచ్‌లో కోహ్లి రెండు సిక్సర్లు సాధించిన తర్వాత వన్డేల్లో సెంచరీ సిక్సర్ల మార్కును చేరాడు. భారత్ తరపున ధోని(216)తొలి స్థానంలో ఉన్నాడు. మరొకవైపు కెరీర్‌లో 34వ వన్డే సెంచరీ చేసిన క్రమంలో దక్షిణాఫ్రికాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్ గా కోహ్లి రికార్డులకెక్కాడు. సచిన్ (152) స్కోరును అతను దాటేశాడు. సింగిల్స్ ద్వారానే వంద పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్ కోహ్లి. ఈ మ్యాచ్‌లో 75 సింగిల్స్ తీసిన అతను 11 సార్లు 2 పరుగులు, ఒకసారి 3 పరుగుల చొప్పున సాధించాడు. ఈ ఆరు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లి.. రెండో వన్డేలో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మరొక రెండు వన్డే సెంచరీలు కొడితే అత్యధిక సెంచరీలు కొట్టిన ఓవరాల్ కెప్టెన్ల జాబితాలో ఏబీ డివిలియర్స్ రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడు. ప్రస్తుత ఏబీ డివిలియర్స్(13) రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, కెప్టెన్‌గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన వారిలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్(22) అగ్రస్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment