విరాట్ కోహ్లి(ఫైల్‌ఫొటో)
కేప్‌టౌన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వెన్నుపట్టేయంతో దక్షిణాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ విరాట్ కోహ్లి అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. ఒక విదేశీ పర్యటలో అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా కోహ్లి ఘనత సాధించాడు. సఫారీలతో ద్వైపాక్షిక సిరీస్‌లో కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 14 ఇన్నింగ్స్‌లు ఆడి 871 పరుగులు నమోదు చేశాడు. ఫలితంగా ఒక టూర్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో సారథిగా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. ఈ జాబితా ముందు వరుసలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(937) ఉన్నాడు. 2003 ఇంగ్లండ్ పర్యటనలో స్మిత్ 16 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది వందలకు పైగా పరుగులు చేశాడు.
శనివారం జరిగిన మూడో టీ20లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియానే విజయం వరించింది. దాంతో సిరీస్‌ను 2-1తో గెలుచుకుని సఫారీ గడ్డపై వన్డే, టీ20 సిరీస్‌లు సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment