సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్లాసన్, డుమినీలు హాఫ్ సెంచరీలు రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. దీనిపై మ్యాచ్ అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి..తాము ఊహించిందే జరిగిందని పేర్కొన్నాడు.
'రెండో టీ20లో దక్షిణాఫ్రికా నుంచి తీవ్ర ప్రతిఘటన ఉంటుందని ముందే అనుకున్నాం. అలానే సఫారీలు చెలరేగి ఆడారు. ప్రధానంగా క్లాసన్, డుమినీలు మ్యాచ్‌ను మా వైపు నుంచి లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో బౌలర్లకు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. మేము ఆదిలోనే కీలక వికెట్లను నష్టపోవడంతో 175 పరుగులపై దృష్టి సారించాం. అయితే మనీష్ పాండే, రైనా, ఎంఎస్ ధోనిలు దూకుడుగా ఆడటంతో దాదాపు 190 పరుగుల వరకూ చేయగలిగాం. క్లాసన్ చెలరేగి ఆడుతుండటంతో చేసేదే ఏమీ లేకపోయింది. ఈ పరాజయ ప్రభావం తదుపరి మ్యాచ్‌పై ఎంతమాత్రం ఉండదు. మేము బాగా ఆడాం. కానీ బౌలింగ్‌లో విఫలం కావడంతో ఓటమి చూడాల్సి వచ్చింది. ఆఖరి టీ20లో గెలిచి సిరీస్‌ను సాధించడంపైనే మా దృష్టి' అని కోహ్లి పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment