నేలకు దిగిన తారలు! | Landed on the ground, the stars! | Sakshi
Sakshi News home page

నేలకు దిగిన తారలు!

Published Thu, Feb 13 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM

నేలకు దిగిన తారలు!

నేలకు దిగిన తారలు!

మూడేళ్లలో ఎంత మార్పు...ఐపీఎల్-4 (2011)లో  రికార్డు స్థాయి మొత్తం పలికిన ఆటగాళ్లు ఇప్పుడు నేలపైకి దిగాల్సి వచ్చింది. ఆయా ఆటగాళ్ల చెత్త ప్రదర్శన కావచ్చు లేదా ఫ్రాంచైజీల ఆలోచనా ధోరణి, వ్యూహాల్లో వచ్చిన మార్పు కారణమేదైనా కావచ్చు. గతంలో అపరిమిత అంచనాలతో కొంత మందిని సొంతం చేసుకున్న జట్లు అప్పట్లో నిరాశ పడాల్సి వచ్చింది.
 
 భారత క్రికెట్‌లో విధ్వంసకరమైన బ్యాటింగ్‌కు ప్రతిరూపంగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్ ధర భారీగా తగ్గిపోవడం ఈ ఏడాది పెద్ద సంచలనం. గత వేలంలో భారీ మొత్తాన్ని ఇంటికి తరలించిన పఠాన్ బ్రదర్స్ విలువ ఈ సారి పూర్తిగా తగ్గిపోయింది. ఉతప్ప, సౌరభ్ తివారీలు గతంతో చాలా తక్కువ మొత్తానికే అమ్ముడుపోయారు.
 
 వీళ్లకు ఓకే...
 ఐపీఎల్ వేలంలో కొంత మంది క్రికెటర్లకు వారి స్థాయికి తగ్గ మొత్తం లభించింది. భారీ రికార్డు మొత్తాలు కాకపోయినా, మరీ ఆయా ఆటగాళ్ల విలువను తగ్గించే ధర మాత్రం పలకలేదు. కలిస్, వార్నర్, జాన్సన్, మైక్ హస్సీ, బ్రెండన్ మెకల్లమ్, మురళీ విజయ్, మ్యాక్స్‌వెల్ తదితరులు వేలంలో చెప్పుకోదగ్గ ధరకే అమ్ముడుపోయారు. ఇక స్టీవెన్ స్మిత్, డి కాక్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీవంటి ఆటగాళ్లు ఇటీవల చక్కటి ప్రదర్శనతో తమ స్థాయికి పెంచుకున్నారు. కౌల్టర్ నీల్, స్టార్క్‌లాంటి పేస్ బౌలర్లకు అనూహ్య ధర పలకగా...అండర్సన్‌కు ఊహించినంత కాకపోయినా మంచి విలువే దక్కింది.
 
 మాకొద్దీ ఆటగాళ్లు...
 చెప్పుకోదగ్గ ఆటగాళ్లుగా గుర్తింపు, టి20ల్లో మంచి ప్రదర్శన ఇవ్వగల సామర్ధ్యం ఉన్నా కొంత మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ముఖ్యంగా గత సీజన్లలో కెప్టెన్లుగా వ్యవహరించిన జయవర్ధనే (శ్రీలంక), వైట్,  డేవిడ్ హస్సీ, క్రిస్టియాన్ (ఆస్ట్రేలియా), టేలర్ (న్యూజిలాండ్) లను ఏ జట్లూ తీసుకోకపోవడం ఆశ్చర్యం. అలాగే శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్, స్టార్ ఆటగాడు దిల్షాన్‌నూ పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితం ఓ వెలుగు వెలిగిన భారత బౌలర్ ప్రవీణ్‌నూ ఎవరూ తీసుకోలేదు. ధోనికి సన్నిహితుడు ఆర్పీసింగ్‌నూ ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.
 వేలంలో అమ్ముడుపోని మరి కొందరు గుర్తింపు ఉన్న ఆటగాళ్లు: నాథన్ మెకల్లమ్, అజంతా మెండిస్, శామ్యూల్స్, గుప్తిల్, బొపారా, మునాఫ్, ఫ్రాంక్లిన్, రైడర్, ఫిలాండర్, మురళీ కార్తీక్, కీస్వెటర్.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement