ఇండియన్ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ జోడి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ టైటిల్ సాధించారు.
న్యూఢిల్లీ: భారత్ ఏస్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. పేస్ జోడి ఫైనల్లో విజయం సాధించింది. పేస్ కిది 15వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.
ఆదివారం జరిగిన ఫైనల్లో పేస్, మార్టినా హింగిస్ జోడి 6-4, 6-3 తేడాతో డానియల్ నెస్టార్, క్రిస్టినా (ఫ్రాన్స్) పై గెలిచారు. 41 ఏళ్ల పేస్ తన కెరీర్లో ఎనిమిది పురుషుల డబుల్స్, ఏడు మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లను సాధించాడు.