
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ సీజన్‌లో ఆరోసారి ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఓపెన్ బ్రెస్ట్ క్రెడిట్ అగ్రికోల్ టోర్నీలో పేస్– వరేలా (మెక్సికో) ద్వయం టైటిల్‌కు విజయం దూరంలో ఉంది.
సెమీఫైనల్లో టాప్ సీడ్ పేస్–వరేలా జోడీ 7–5, 7–6 (7/5)తో సిమోన్ బొలెలీ–బ్రాకియాలి (ఇటలీ) ద్వయంపై గెలిచింది.