సచిన్‌కు ప్రత్యామ్నాయం లభించడం చాలా కష్టం : సునీల్ గవాస్కర్ | legends reaction on sachin tendulkar retirement | Sakshi
Sakshi News home page

సచిన్‌కు ప్రత్యామ్నాయం లభించడం చాలా కష్టం : సునీల్ గవాస్కర్

Published Fri, Oct 11 2013 1:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM

legends reaction on sachin tendulkar retirement

 ‘భారత క్రికెట్‌కు సచిన్ చేసిన సేవ ఎవరూ చేయలేదు. మాస్టర్ లేని టీమిండియాను ఊహించుకోలేనప్పటికీ  అతని నిర్ణయాన్ని మనం గౌరవించాలి’      -శ్రీనివాసన్
 
 ‘వీడ్కోలు పలుకుతున్న సచిన్ భవిష్యత్ బాగుండాలని మనసారా ఆకాంక్షిస్తున్నా.  బాధతో మాటలు రావడం లేదు’
     - సంజయ్ పటేల్ (బీసీసీఐ కార్యదర్శి)
 
 ‘సచిన్ వీడ్కోలు నిర్ణయంతో ప్రపంచ క్రికెట్‌లో ఓ స్వర్ణయుగం ముగిసిపోతుంది. అతను సాధించిన ఘనతలు అన్ని తరాల క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాయి.     - శరద్ పవార్
 
 ‘ సచిన్‌కు ప్రత్యామ్నాయం లభించడం చాలా కష్టం. లక్ష్మణ్, గంగూలీ, ద్రవిడ్ రిటైర్మెంట్ తర్వాత ఏంజరిగిందో చూస్తున్నాం కదా.      - సునీల్ గవాస్కర్
 
 ‘పాతికేళ్ల సుదీర్ఘ కెరీర్ అంటే సాధారణ విషయం కాదు. అతనితో  ఇన్నేళ్లు కలిసి ఆడటం గర్వకారణంగా భావిస్తున్నాను. సచిన్‌లాంటి ఆటగాడు పుట్టడం క్రికెట్ చేసుకున్న అదృష్టం’
 - వీవీఎస్ లక్ష్మణ్
 
 ‘సచిన్ సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నాడు. . ఈ రెండు మ్యాచ్‌ల కోసం అభిమానులు భారీగా తరలి రావాలి.     - గంగూలీ
 
 ‘మాస్టర్ నిర్ణయంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎప్పుడైనా ఇది రావాల్సిందే. కాబట్టి అతని నిర్ణయాన్ని గౌరవించాలి. సచిన్ కెరీర్ మొత్తం మనల్ని సంతోషపర్చాడు.
     - అజహరుద్దీన్
 
 ‘భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌కు దుర్దినం. కిట్‌తో సచిన్‌ను ఇంకా చూడలేం. కోరుకున్న విధంగా అతను రిటైరవుతున్నాడు’     - మురళీధరన్
 
 ‘సచిన్ పదో నంబర్ జెర్సీని దాచిపెట్టాలి. పాజీకి శాల్యూట్’     - గౌతమ్ గంభీర్
 
 సచిన్ ఆట ఒక వ్యసనం. అతను లేకుండా క్రికెట్ చూడటమా? ఆ ఊహనే భరించలేకపోతున్నా’     
 - షారూఖ్ (బాలీవుడ్ యాక్టర్)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement