సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్యర్యంలో జరిగిన రంగారెడ్డి జిల్లా బాక్సింగ్ టోర్నీలో లోకేశ్, లావణ్య విజేతలుగా నిలిచారు. సరూర్‌నగర్ బాక్సింగ్‌హాల్‌లో గురువారం జరిగిన పోటీల్లో అండర్-17 బాలుర 46 కేజీల విభాగంలో జి. లోకేశ్ (జడ్పీహెచ్‌ఎస్, సరూర్‌నగర్) విజే తగా నిలిచి పసిడి పతకాన్ని దక్కించుకోగా... డి. అఖిల్ (జడ్పీహెచ్‌ఎస్, దర్గా) రజత పతకాన్ని సాధించాడు. కె. నివాస్ (నారాయణ), కె. దినేశ్ (నాగార్జున స్కూల్) తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు. బాలికల 42 కేజీల విభాగంలో లావణ్య (జడ్పీహెచ్‌ఎస్, సరూర్‌నగర్) స్వర్ణ పతకాన్ని సంపాదించింది.
ఇతర వెయిట్ కేటగిరీల విజేతలు
అండర్-17 బాలురు
46-48 కేజీ: 1. పవన్, 2. లోహిత్, 3. కె. సాయి నిహాల్; 48-50 కేజీ: 1. ఎస్. భువన్, 2. బి. వంశీ; 50-52 కేజీ: 1. ఎం. శ్రీనివాసులు, 2. ఎం. సాత్విక్ రెడ్డి; 52-54 కేజీ: 1. కె. బాలకృష్ణ; 54-57 కేజీ: 1. ఎన్. హరీశ్; 66-70 కేజీ: 1. వి. వరుణ్; 70-75 కేజీ: 1. కె. వేణు గౌడ్;
అండర్-17 బాలికలు
42-44 కేజీ: మేఘన; 44-46 కేజీ: ఎన్. హర్షిత; 46-48 కేజీ: కె. మిథాలి; 48-50 కేజీ: జి. కళావతి; 50-53కేజీ: పి. గుణనిధి; 53-56 కేజీ: కె. యశస్వి; 59-62 కేజీ: పి. రాజేశ్వరి; 75-81 కేజీ: ప్రవళిక; 81-86 కేజీ: జాహ్నవి.
అండర్-14 బాలురు
28-30 కేజీ: రాహుల్‌సింగ్; 30-32 కేజీ: కె. దేవి వరప్రసాద్; 32-34 కేజీ: డి. అనూష్; 34-36 కేజీ: టి. భువనేశ్వర్; 36-38 కేజీ: ఎస్. రక్షిత్; 38-40కేజీ: అబ్దుల్ ఖలీద్.