లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకాలు సాధించిన ఆటగాళ్లను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.
సైఫాయీ: లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకాలు సాధించిన ఆటగాళ్లను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ‘సైఫాయీ మహోత్సవ్’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, అగ్రశ్రేణి షూటర్ గగన్ నారంగ్‌లకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రూ.25 లక్షల నజరానా అందించారు.
వీరితో పాటు కాంస్య పతకాలు గెలుపొందిన మేరీకామ్, యోగేశ్వర్ దత్‌లకు కూడా అంతే మొత్తం అందించారు. రజతం గెలిచిన రెజ్లర్ సుశీల్ కుమార్, షూటర్ విజయ్ కుమార్‌లకు రూ. 50 లక్షల నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ కూడా పాల్గొన్నారు.