భావోద్వేగానికి గురైన సిరాజ్.. కోచ్ చేతులు మీదుగా క్యాప్ అందుకుంటూ..(ఇన్‌సెట్‌లో)
సాక్షి, రాజ్‌కోట్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసిన హైదరాబాద్ యువ సంచలనం మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్‌కు ముందు కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా సిరాజ్ క్యాప్ అందుకున్నాడు. 2015 వరకు టెన్నిస్ బంతితో గల్లీ క్రికెట్ ఆడిన సిరాజ్ కేవలం రెండేళ్ల వ్యవదిలోనే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. కనీసం ఊహకందని కలను నేరవేరిన సమయంలో తన పేదరికం గుర్తోచ్చిందో లేక వాళ్ల అమ్మ ‘క్రికెట్ వద్దురా.. మనకు అన్నం పెడుతుందా’ అని గల్లీల్లో తరిమిన క్షణాలు గుర్తొచ్చాయో కానీ మనోడు ఒక్కసారి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.
అయితే గతేడాది ఐపీఎల్‌తోనే స్టార్ ఆటగాడిగా మారిన సిరాజ్.. తన తొలి టీ20 మ్యాచ్‌లో భయపడుతూనే బౌలింగ్ చేసినట్లు కనిపించింది. తొలి ఓవర్ తొలి బంతికే ఫోర్ ఇచ్చిన సిరాజ్ 4 ఓవర్లు వేసి ఏకంగా 53 పరుగుల సమర్పించుకున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో తడబడ్డ సిరాజ్‌కు తన మూడో ఓవర్ రెండో బంతికి కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అవుట్ అవ్వడం ఊరటనిచ్చింది. అయితే తన చివరి ఓవర్‌లో తొలి బంతిని మున్రో సిక్సుగా మలచడంతో సిరాజ్ మరింత నర్వస్‌కులోనై పరుగులిచ్చాడు. కానీ టీ20లో బౌలర్లు పరుగులు ఇవ్వడం సహాజమే కానీ ఈ మ్యాచ్ భారత్ 40 పరుగుల తేడాతో ఓడిపోవడం సిరాజ్ ప్రస్థానంలో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment