'ధోనీ లేకపోవడం లాభిస్తుంది'
సిడ్నీ:మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి వైదొలగడం తమకు లాభిస్తోందని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. టెస్టుల్లో విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోనీ సిడ్నీలో జరిగే టెస్ట్ మ్యాచ్ కు ముందే వీడ్కోలు చెప్పడం ఆసీస్ కు కలిసొస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'ధోనీ టీం గురించి చాలా ఎక్కువగా ప్రణాళికలు రచిస్తాడు. అవి ఎప్పుడూ కూడా ప్రత్యర్థికి సవాల్ గా ఉంటాయి.మ్యాచ్ కోల్పోయే సమయంలో కూడా ధోనీ జట్టును కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి' అని వార్నర్ తెలిపాడు.
ప్రస్తుతం ధోనీ లేకపోవడం మాత్రం ఖచ్చితంగా ఆసీస్ కు లాభిస్తోందన్నాడు. టీమిండియాకు బాధ్యతలు చేపట్టనున్న విరాట్ కోహ్లీ జట్టును ఏవిధంగా నడిపిస్తాడో వేచి చూడక తప్పదన్నాడు. కోహ్లీకి చాలా భవిష్యత్తు ఉన్నందున టీమిండియా కెప్టెన్సీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.