ధోని తీరును తప్పుబట్టిన గవాస్కర్! | Mahendra Singh Dhoni Had 'No Flexibility' in Bowling Changes, Says Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

ధోని తీరును తప్పుబట్టిన గవాస్కర్!

Published Mon, Oct 26 2015 7:00 PM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

ధోని తీరును తప్పుబట్టిన గవాస్కర్!

ధోని తీరును తప్పుబట్టిన గవాస్కర్!

ముంబై: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి వన్డేలో టీమిండియా ఘోర ఓటమికి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు బౌలర్లే కారణమంటూ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ధ్వజమెత్తాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చెలరేగిపోతున్నప్పుడు బౌలర్లను పదే పదే మార్చకుండా ధోని కఠినంగా వ్యవహరించాడంటూ  గవాస్కర్ విమర్శించాడు.  ఆ మ్యాచ్ లో ఉన్న టీమిండియా బౌలింగ్ వనరులను వినియోగించుకోవడంలో ధోని ఎటువంటి తెగువ చూపించలేదన్నాడు. ' బౌలింగ్ లో ఉన్న సౌలభ్యాన్ని ధోని ఉపయోగించుకోలేదు.  ఆదిలో బౌలింగ్ ను కొంతమేర మార్చినా సత్ఫలితాన్ని ఇవ్వలేదు.  దాన్ని పక్కకు పెడితే ఆ తరువాత బౌలింగ్ లో ఉన్న అవకాశాలను ధోని సరైన రీతిలో వినియోగించుకోలేదు. అదే దక్షిణాఫ్రికా మరింత చెలరేగిపోవడానికి కారణం' అని గవాస్కర్ ఆరోపించాడు.

ఐదు వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి వన్డేలో దక్షిణాఫ్రికా 214 పరుగుల తేడాతో గెలిచి ధోని సేనపై పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement