ఇప్పటికీ ధోనినే మేటి! | Mahendra Singh Dhoni is 'Still India's No. 1 Finisher', Says Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ ధోనినే మేటి!

Published Mon, Oct 12 2015 2:37 PM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

ఇప్పటికీ ధోనినే మేటి!

ఇప్పటికీ ధోనినే మేటి!

కాన్పూర్:టీమిండియా జట్టులో మంచి మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే చివర్లో పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో అతని ఆటతీరుపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.  అయితే ధోని మంచి మ్యాచ్ ఫినిషర్ అనే విషయంపై ఎటువంటి అనుమానాలు అక్కర్లేదంటూ మాజీ  కెప్టెన్ సునీల్  గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఏదో ఒక మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన ధోనిని విమర్శించాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేశాడు. 

 

'టీమిండియా నంబర్ వన్ మ్యాచ్ ఫినిషర్ ధోనినే. అందులోఎటువంటి సందేహం లేదు. కొన్ని సందర్భాల్లో మనం సరిగ్గా చేస్తామనుకున్నది చేయడంలో విఫలం  అవుతూ ఉంటాం. అది కేవలం క్రీడలకే పరిమితం కాదు.  ప్రతీ రంగంలోనూ జరుగుతూ ఉంటుంది. ఓటమికి కేవలం ధోనిని మాత్రమే బలిపశువును చేయొద్దు' అంటూ గవాస్కర్ హితవు పలికాడు. జట్టులో సమిష్టితత్వం లోపించినప్పుడు ఓటమి సహజంగానే జరుగుతుందని గవాస్కర్  పేర్కొన్నాడు. భారత క్రికెట్ జట్టులో ఇంకా ఏదైనా మెరుగు పడాల్సిన  అవసరం ఉందనుకుంటే అది బౌలింగ్ లోమాత్రమేనని ఈ మాజీ లెజెండ్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement