లండన్ : ‘పందిలా బలిసావు.. డైట్ చేయవచ్చు కదా’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై నోరుపారేసుకున్న ఓ అభిమాని ఎట్టకేలకు తన తప్పును తెలుసుకున్నాడు. సోషల్‌మీడియా ప్రభావంతో తన తప్పును తెలుసుకొని సర్ఫరాజ్‌కు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన పని పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. ‘పాక్ కెప్టెన్ పట్ల నేను ప్రవర్తించిన తీరుకు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనతో బాధపడ్డ ప్రతి ఒక్కరికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. నేను అసలు ఆ వీడియోనే అప్‌లోడ్ చేయలేదు. అది ఎలా వైరల్ అయ్యిందో నాకు తెలియదు. కానీ నేను చేసింది చాలా తప్పు. సర్ఫరాజ్‌తో ఉన్న చిన్నారి తన కొడుకని నాకు తెలియదు.’ అంటూ క్షమాపణలు కోరాడు.
The man who abused sarfraz today makes an apology in his new video. Saying sorry to @SarfarazA_54 nd whole nation.👏👏
— M Mansoor: IStandWithSarfraz 🇵🇰 (@mansoorThoughts) June 21, 2019
says that he neither new that the kid was his son nor sarfraz is hafiz e Quran
What you people say on this ⚡#PakistanLovesSarfaraz #sorrysarfaraz pic.twitter.com/wdxQRJjhV9
కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన సర్ఫరాజ్‌ను సదరు అభిమాని సెల్ఫీ అడగ్గా.. సర్ఫరాజ్ సైతం అంగీకరించాడు. కానీ అతని కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని పాక్ కెప్టెన్ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు. ‘సర్ఫరాజ్ బాయ్.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్ చేయవచ్చు కదా’ అంటూ అభ్యంతరకర పదజాలం వాడాడు. అయినా సర్ఫరాజ్ ఏ మాత్రం ఆగ్రహానికి గురవ్వకుండా ప్రశాంతంగా అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై యావత్ క్రికెట్ అభిమానులు సర్ఫరాజ్‌కు మద్దతుగా నిలిచారు. అభ్యంతరకర పదజాలంతో నోరుపారేసుకున్న సదరు వ్యక్తిపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా ప్రశాంతంగా ఉండటమే మంచిదని వాళ్లమ్మ సర్ఫరాజ్‌కు నేర్పించింది. అందుకే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు’ అని, ఒక ఫ్రొఫెషనల్ ఆటగాడి పట్ల అలా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరైతే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని కామెంట్లు పెట్టారు. ఈ దెబ్బకు దిగొచ్చిన ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకుని క్షమాపణలు కోరాడు.
చదవండి: సర్ఫరాజ్‌ను సెల్ఫీ అడిగి మరి తిట్టాడు!
మా కెప్టెన్‌కు బుద్ధి లేదు : అక్తర్ ఫైర్
మైదానంలోనే పాక్ కెప్టెన్‌కు అవమానం!
Comments
Please login to add a commentAdd a comment