బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా
దుబాయ్ : ఆసియాకప్ ఫైనల్లో విజయం కోసం ఆఖరి బంతి వరకు పోరాడుతామని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా స్పష్టం చేశాడు. మరికొద్ది క్షణాల్లో ఈ భారత్-బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ సమరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మొర్తజా మాట్లాడుతూ.. గాయాలతో ఒక్కొక్క ఆటగాడు దూరం కావడంతో మేం కష్టాలు ఎదుర్కొన్నాం. కానీ ఈ పరిస్థితుల్లో మా ఆటగాళ్లు చాలా నేర్చుకున్నారు. మా ఆటగాళ్లకు ఇది ఓ పాఠంలాంటిది. మేం ఖచ్చితంగా చివరి బంతి వరకు పొరాడాలని మా యువ ఆటగాళ్లకు బోధపడిందనుకుంటున్నాను. షకీబ్- ఇమామ్‌లు లేకపోవడం మాకు కష్టమే. ఈ టోర్నీ ఆరంభం ముందు షకీబ్ 50 శాతమే ఫిట్‌గా ఉన్నాడు. తొలి మ్యాచ్ నుంచే తమీమ్ జట్టులో లేడు. కానీ మా ఆటగాళ్లు నిరుత్సాహపడలేదు.
గ్రూప్ దశలో అఫ్గాన్, సూపర్-4లో భారత్ చేతిలో ఓటమి ఎదురైనప్పటికి మేం పోరాడుతాం. ఇప్పటివరకూ మా ఆటతీరుతో మేం గర్వపడ్డాం. అయితే టీమిండియా ఎంతో బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్లో ఆ జట్టుతో మేం ఎలా పోరాడతాం అన్నదే ఇక్కడ ప్రధానం. ఆసియా కప్‌లో టీమిండియానే ఫేవరెట్.. అందుకే మేం మానసికంగా బలంగా ఉండి.. చివరి బంతి వరకూ పోరాడాలి’ అని బంగ్లా సారథి పేర్కొన్నాడు. గాయాలతో బంగ్లాదేశ్ కీలక ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్‌లను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక భారత్‌తో 34 వన్డేలాడిన బంగ్లాదేశ్ కేవలం 5 సార్లు మాత్రమే గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment