దుబాయ్ : భారత్‌తో జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ శతకం సాధించాడు. 87బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్‌లతో కెరీర్‌లోనే తొలి శతకం నమోదు చేశాడు. వచ్చిరావడంతోనే దాటిగా ఆడిన లిటన్ దాస్.. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ మెహ్‌దీ హసన్(32) సాయంతో తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించాడు.
27 వన్డేలనంతరం బంగ్లా ఓపెనర్స్ సెంచరీ భాగస్వామ్యం నెలకోల్పడం విశేషం. అనంతరం మెహ్‌దీ హసన్‌ను పార్ట్‌టైం బౌలర్ జాదవ్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇమ్రుల్ కైస్(2), ముష్ఫికర్ రహీమ్ (5), మహ్మద్ మిథున్ (2)ల వికెట్లను బంగ్లాదేశ్ వరుసగా కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment