న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియాకు మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో 183 పరుగుల టార్గెట్ను కివీస్ కాపాడుకుంటుందనే క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. తామంతా న్యూజిలాండ్కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నట్లు తెలియజేశారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ ఆస్ట్రేలియా ముందు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనిని కాపాడుకోగలుగుతుందా అంటూ సాక్షి.. ఫేస్బుక్ ద్వారా క్రికెట్ అభిమానులను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ఈ టార్గెట్ను కాపాడుకోలేకపోవచ్చని కూడా మరికొందరు అభిమానులు చెప్పారు. చెప్పలేమని, ఆస్ట్రేలియా గెలుస్తుందని కూడా ఇంకొందరు అభిమానులు అభిప్రాయపడ్డారు.