
వడోదర: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంకిత్ బావ్నె (116 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకానికి తోడు ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (90; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (61; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల దూకుడైన అర్ధ శతకాలతో వెస్టిండీస్‌తో సన్నాహక మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ భారీ స్కోరు సాధించింది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పృథ్వీ షా (8), హనుమ విహారి (3) త్వరగానే ఔటైనా కెప్టెన్ కరుణ్ నాయర్ (29) తోడుగా మయాంక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మూడో వికెట్‌కు 92 పరుగులు జత చేశారు. విండీస్ బౌలర్లలో బిషూ (3/104), గాబ్రియేల్ (2/41) మినహా మిగతావారు ప్రభావం చూపలేదు.
Comments
Please login to add a commentAdd a comment