
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ ‘ఎ’తో జరుగుతోన్న మూడు అనధికార టెస్టుల సిరీస్‌ను భారత్ ‘ఎ’ 2–0తో కైవసం చేసుకుంది. శనివారం ముగిసిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్లతో విండీస్‌పై గెలుపొందింది. విండీస్ విధించిన 278 పరుగుల లక్ష్యఛేదనలో... ఓవర్‌నైట్ స్కోరు 185/3తో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 79.1 ఓవర్లలో 281 పరుగులు చేసి గెలుపొందింది. ప్రియాంక్ పాంచల్ (68), మయాంక్ అగర్వాల్ (81), అభిమన్యు ఈశ్వరన్ (62 నాటౌట్), అన్‌మోల్ ప్రీత్ సింగ్ (51 నాటౌట్) జట్టును గెలిపించారు. మూడో టెస్టు ఈనెల 6 నుంచి జరుగుతుంది.