సౌతాంప్టన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. అయితే ఇందులో కోహ్లిదేం లేదు. అంతా మన నెటిజన్ల సృష్టే. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా మహ్మద్ షమీ వేసిన బంతి ఆ జట్టు ఓపెనర్ హజ్రతుల్లా ప్యాడ్స్‌కు తగిలింది. భారత ఆటగాళ్లంతా అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని, బౌలర్ షమీతో చర్చించిన కోహ్లి రివ్యూ కోరాడు. అయితే బంతి ఔట్ సైడ్ పిచ్ అవ్వడంతో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే మొగ్గు చూపాడు. దీనికి సంతృప్తి చెందని కోహ్లి.. అంపైర్ దగ్గరకు వెళ్లి రెండు చేతులు జోడించి ఏదో అడిగాడు. ఇప్పుడు ఇదే ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఫన్నీ కామెంట్స్‌తో నెటిజన్లు పోటీపడుతున్నారు. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా అభిమానులకు వేలు చూపించిన కోహ్లి ఫొటోను జత చేసి మరి మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. క్లాస్‌లో అటెండెన్స్ కోసం, లోన్‌కోసం, ప్రాధేయపడే స్టూడెంటని కామెంట్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు దొరికినప్పుటి పరిస్థితని, లీవ్ కోసం బాస్ ముందుకు వెళ్లినప్పుడు ఇలానే ఉండాలని ట్రోల్ చేస్తున్నారు. (చదవండి : మావాళ్లు ఆకలిమీదున్నారు : కోహ్లి)
ఇక పసికూనగా భావించిన అఫ్గాన్ కోహ్లిసేనకు పరీక్షగా నిలిచింది. ఛేదనలో బలమైన బౌలింగ్‌ను తట్టుకుంటూ కోహ్లి సేనకు ఈ ప్రపంచ కప్‌లో తొలి ఓటమి రుచి చూపించేలా కనిపించింది. కానీ, బుమ్రా, షమీ పేస్‌తో పడగొట్టడంతో పోరాడి ఓడామన్న సంతృప్తి మిగుల్చుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (63 బంతుల్లో 67; 5 ఫోర్లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ (68 బంతుల్లో 52; 3 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. ఆఫ్ స్పిన్నర్ ముజీబుర్ రహ్మాన్ (1/26) పొదుపుగా బౌలింగ్ చేశాడు. బౌలింగ్‌లో మెరిసిన ఆల్‌రౌండర్లు మొహమ్మద్ నబీ (55 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్, 2/33), రహ్మత్ షా (63 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1/22)లు ఛేదనలోనూ అఫ్గాన్‌ను గెలుపు దిశగా నడిపించారు. పేసర్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జస్‌ప్రీత్ బుమ్రా (2/39), మొహమ్మద్ షమీ (4/40) కీలక సమయాల్లో భాగస్వామ్యాలను విడగొట్టడంతో ప్రత్యర్థి 49.5 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో అతికష్టం మీద విజయం సాధించింది. (చదవండి : షమీ హ్యాట్రిక్ క్రెడిట్ ధోనిదే! )
When traffic police catches me...#INDvAFG pic.twitter.com/xtZ6lkZu3g
— Tweet Potato (@newshungree) June 22, 2019
Students in college for attendance#CWC19 #Kohli #INDvAFG pic.twitter.com/KVkgrNIu3M
— Sachin | सचिन (@Subtle_Sachin) June 22, 2019
attitude of a guy whole year vs few days before the exam..#INDvAFG pic.twitter.com/8X3vVnWBi7
— Chirag (@chirag_rachchh) June 22, 2019
1. Banks when I don't need loan
— Tweet Potato (@newshungree) June 22, 2019
2. Banks when I really need loan#INDvAFG pic.twitter.com/NKn84QYOd8
Comments
Please login to add a commentAdd a comment