లండన్ ఒలింపిక్స్‌తో స్విమ్మింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన అమెరికా దిగ్గజం ఫెల్ప్స్... ఇటీవల మళ్లీ మనసు మార్చుకుని ఈత కొలనులోకి దిగిన సంగతి తెలిసిందే. తన పునరాగమనం చేసిన నెల రోజుల్లోనే ఈ స్టార్ స్విమ్మర్ తొలి పతకం సాధించాడు.
చార్లోట్: లండన్ ఒలింపిక్స్‌తో స్విమ్మింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన అమెరికా దిగ్గజం ఫెల్ప్స్... ఇటీవల మళ్లీ మనసు మార్చుకుని ఈత కొలనులోకి దిగిన సంగతి తెలిసిందే. తన పునరాగమనం చేసిన నెల రోజుల్లోనే ఈ స్టార్ స్విమ్మర్ తొలి పతకం సాధించాడు.
చార్లోట్ గ్రాండ్ ప్రి 100మీ. బటర్‌ఫ్లయ్ విభాగంలో తను విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన పోటీలో తను 52.13సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. పావెల్ సంకోవిచ్ (బెలారస్, 52.72సె.), జోసెఫ్ స్కూలింగ్ (సింగపూర్, 52.95సె.) తర్వాత స్థానాల్లో నిలిచారు.