వెస్టిండీస్‌ 286 ఆలౌట్‌ | Mohammad Amir claims five-for for Pakistan | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌ 286 ఆలౌట్‌

Published Mon, Apr 24 2017 1:13 AM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

వెస్టిండీస్‌ 286 ఆలౌట్‌

వెస్టిండీస్‌ 286 ఆలౌట్‌

కింగ్‌స్టన్‌: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 278/9తో మూడో రోజు ఆట కొనసాగించిన వెస్టిండీస్‌ మరో ఎనిమిది పరుగులు జోడించి ఆలౌటైంది. విండీస్‌ జట్టులో రోస్టన్‌ చేజ్‌ (63; 7 ఫోర్లు, ఒక సిక్స్‌), డౌరిచ్‌ (56; 9 ఫోర్లు), హోల్డర్‌ (57 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు.

పాక్‌ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ 44 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం విశేషం. కడపటి వార్తలు అందే సమయానికి పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement