
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తొలి ఫైనల్ బెర్తును చెన్నై సూపర్ కింగ్స్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించి ఫైనల్లోకి ప‍్రవేశించింది. అయితే ప్లేఆఫ్‌కు నాలుగు జట్లు అర్హత సాధించిన తర్వాత భారత మాజీ క్రికెటర్ మొహ్మద్ కైఫ్ చేసిన ట్వీట్ ఆసక్తిని పెంచుతుంది. దానికి కొన్ని గణాంకాలను కూడా కైఫ్ ఉదహరించాడు కూడా.
పాయింట్ల పట్టికలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ చివరి స్థానంలో నిలిచిన ప్రతిసారీ రెండో స్థానంలో ఉన్న జట్టే విజేతగా నిలిచింది. 2011లో చెన్నై, 2013లో ముంబయి, 2014లో కోల్‌కతా ఇలాగే విజేతగా అవతరించాయని కైఫ్ పేర్కొన్నాడు. ప్రస్తుత సీజన్‌లో లీగ్ దశ ముగిసే సరికి సీఎస్‌కే రెండో స్థానంలో నిలిచింది. మరి కైఫ్ చెప్పిన జోస్యం ప‍్రకారం సీఎస్‌కే గెలవాలి. మరి ధోని సేనకు వరం అవుతుందో లేదో చూడాలి.
An interesting stat-
— Mohammad Kaif (@MohammadKaif) 20 May 2018
Whenever Delhi Daredevils finishes at the last position in the points table, the team who finishes at the second position in that season has won the IPL.
2011 - CSK
2013 - MI
2014 - KKR @ChennaiIPL will be happy :)#DDvMI