మిస్టర్ కూల్ ధోనీ డాన్స్ ఇరగదీశాడు..! | MS Dhoni shakes a leg with Rising Pune Supergiants teammates | Sakshi
Sakshi News home page

మిస్టర్ కూల్ ధోనీ డాన్స్ ఇరగదీశాడు..!

Published Mon, Apr 10 2017 3:00 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

మిస్టర్ కూల్ ధోనీ డాన్స్ ఇరగదీశాడు..!

మిస్టర్ కూల్ ధోనీ డాన్స్ ఇరగదీశాడు..!

టీమిండియా కెప్టెన్‌గా ఓ వెలుగు వెలిగిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశాడు. కాగా ఐపీఎల్‌-2017 సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురైన ధోనీ.. సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ధోనీతో జట్టు యాజమాన్యానికి పడటం లేదని వార్తలు వచ్చాయి. టీమ్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త అయిన హర్ష్ గోయెంకా ధోనీపై పరుష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. క్రికెట్‌ మైదానంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సహనంగా ఉండే మిస్టర్ కూల్.. నిజ జీవితంలోనూ అలాగే ఉంటాడు.

టీమ్ యాజమాన్యం తన పట్ల ఎలాంటి వైఖరి ప్రదర్శించినా.. మహీ మాత్రం ఎప్పటిలాగే సహచర ఆటగాళ్లతో కలసి ఉల్లాసంగా గడుపుతున్నాడు. ఐపీఎల్ తాజా సీజన్‌ ప్రారంభమయ్యాక ధోనీ సహచర పుణె ఆటగాళ్లతో కలసి హుషారుగా డాన్స్ చేశాడు. మహీ తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో ఓ షార్ట్ వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోలో ధోనీ.. అజింక్యా రహానెతో కలసి డాన్స్ చేస్తుండగా.. బెన్ స్టోక్స్ వెనుక నిల్చుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన 12 గంటల్లోనే 7.50 లక్షల వ్యూస్, 4400 కామెంట్లు వచ్చాయి.

2008 ఐపీఎల్ ఆరంభమయ్యాక 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఐపీఎల్ నుంచి చెన్నై జట్టును సస్పెండ్ చేశాక గత సీజన్‌లో పుణె కెప్టెన్‌గా ధోనీ నియమితుడయ్యాడు. కాగా కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా సాధారణ ఆటగాడిగా ధోనీ ఐపీఎల్‌లో ఆడుతుండటం ఇదే తొలిసారి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement