హార్దిక్‌కు చీర్స్‌ తెలిపిన ధోని కూతురు | MS Dhonis Daughter Ziva Cheering For Hardik Pandya | Sakshi
Sakshi News home page

హార్దిక్‌కు చీర్స్‌ తెలిపిన ధోని కూతురు

Published Sat, Jun 30 2018 11:00 AM | Last Updated on Sun, Jul 1 2018 10:22 AM

MS Dhonis Daughter Ziva Cheering For Hardik  Pandya - Sakshi

డబ్లిన్‌: ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుని యూకే పర్యటనను ఘనంగా ఆరంభించింది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 143 పరుగుల తేడాతో ఆతిథ్య ఐర్లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. భారత ఇన్నింగ్స్‌లో భాగంగా చివర్లో హార్దిక్‌ చెలరేగి ఆడాడు. కేవలం 9 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 32 పరుగులు చేసి భారత్‌ జట్టుకు భారీ స్కోరు అందించాడు.

అయితే మ్యాచ్‌ అనంతరం పాండ్యా తన ఇన్‌స్టాగ్రాం ద్వారా ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ‘నన్ను ప్రోత్సహించేందుకు ఒక చీర్‌ లీడర్‌ దొరికిందని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ చీర్‌ లీడర్‌ ఎవరో తెలుసా. ఎంఎస్‌ ధోని గారాలాపట్టి జీవా. ‘కమాన్‌... కమాన్‌.. హార్దిక్‌’ అంటూ జీవా ఆ వీడియోలో సందడి చేసింది. ఈ వీడియోను ధోనీ భార్య సాక్షి... పాండ్యాకు పంపించిందట. ఆ వీడియోను హార్దిక్ అభిమానులతో పంచుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement