ముంబై:ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది, ముంబై ఓపెనర్లు సిమ్మన్స్(65), పార్థీవ్ పటేల్(35) పెవిలియన్ కు చేరారు. అనంతరం రోహిత్ శర్మ(17),పొలార్డ్(14) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇందులో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశిస్తుంది.