అందరి దృష్టి నాదల్‌పైనే
న్యూయార్క్: గాయం నుంచి తేరుకున్నాక భీకరమైన ఫామ్‌లో ఉన్న స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ సీజన్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై దృష్టి సారించాడు. మోకాలి గాయం కారణంగా గత ఏడాది యూఎస్ ఓపెన్‌కు దూరంగా నిలిచిన ఈ మాజీ చాంపియన్ ఈసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. సోమవారం మొదలవుతున్న సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ నాదల్‌తోపాటు మాజీ విజేత ఫెడరర్ (స్విట్జర్లాండ్)... డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)... ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) సత్తాకు పరీక్షగా నిలువనుంది.
హార్డ్ కోర్టు సీజన్‌లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో నెగ్గిన నాదల్ ఈ క్రమంలో ఇండియన్ వెల్స్, మాంట్రియల్, సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గి పూర్తి విశ్వాసంతో యూఎస్ ఓపెన్‌లో అడుగుపెడుతున్నాడు. ఒకవేళ నాదల్ విజేతగా నిలిచి జొకోవిచ్ గనుక సెమీఫైనల్లో నిష్ర్కమిస్తే ఈ స్పెయిన్ స్టార్‌కు మరోసారి టాప్ ర్యాంక్ దక్కుతుంది. ర్యాన్ హారిసన్ (అమెరికా)తో సోమవారం జరిగే తొలి రౌండ్‌లో నాదల్ పోటీపడతాడు.
గతంలో వరుసగా ఐదుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఫెడరర్ తొలి రౌండ్‌లో గ్రెగా జెమిల్జా (స్లొవేనియా)తో తలపడతాడు. ‘డ్రా’ ప్రకారం క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్‌కు నాదల్ ఎదురయ్యే అవకాశముంది. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఆమెకు రెండో సీడ్ అజరెంకా (బెలారస్), నాలుగో సీడ్ రద్వాన్‌స్కా (పోలాండ్), ఐదో సీడ్ నా లీ (చైనా) నుంచి పోటీ ఎదురయ్యే అవకాశముంది. తొలి రౌండ్‌లో షియవోని (ఇటలీ)తో సెరెనా ఆడుతుంది.
రాత్రి గం. 8.30 నుంచి
టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం