ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడారంగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణుల హవా కొనసాగుతుందని అంతర్జాతీయ టీటీ కోచ్ మిహిర్ ఘోష్ అన్నారు. గ్లోబల్ టీటీ అకాడమీ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన రాష్ట్ర ర్యాంకింగ్ టీటీ టోర్నీ ఆరంభ వేడుకలకు ఆయన ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఘోష్ మాట్లాడుతూ... ‘గత నాలుగేళ్లలో రాష్ట్రం నుంచి అద్భుతమైన ప్లేయర్లు వచ్చారు.
జాతీయ స్థాయిలో నిఖత్ బాను, స్ఫూర్తి, నైనా, శ్రీజలు చక్కటి నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు. భవిష్యత్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. క్రీడాకారు లు ఆటపట్ల అంకితభావం కనబరచాలని శాప్ ఎండీ రాహుల్ జొజ్జా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంక్ జనరల్ మేనేజర్ టి.వి.ఎస్.చంద్రశేఖర్, అర్జున అవార్డు గ్రహీత మీర్ ఖాసీమ్, ఏపీటీటీఏ జీవితకాలం అధ్యక్షుడు చెంచు రామయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
టీటీలో ఏపీ క్రీడాకారిణుల హవా
Published Sat, Aug 17 2013 12:26 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement
Advertisement