సెల్ఫీలు ఆపి.. ఆటపై ఫోకస్ చెయ్! | Netizens trolls Hardik Pandya for selfies and low performance | Sakshi
Sakshi News home page

సెల్ఫీలు ఆపి.. ఆటపై ఫోకస్ చెయ్!

Published Fri, Feb 9 2018 8:43 PM | Last Updated on Sat, Feb 10 2018 3:49 AM

Netizens trolls Hardik Pandya for selfies and low performance - Sakshi

టీమిండియా ఆటగాళ్లతో హార్ధిక్ పాండ్యా

జొహన్నెస్‌బర్గ్‌: టీమిండియా యువ సంచలనం, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. జట్టు ఆటగాళ్లతో సెల్ఫీలు దిగడం ఆపి.. ఆటపై దృష్టి పెట్టి జట్టు విజయంలో భాగస్వామి కావాలని పాండ్యాకు చురకలు అంటిస్తున్నారు. విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. 6 వన్డేల సిరీస్‌లో ఇదివరకే భారత్ 3-0తో ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆల్ రౌండర్ పాండ్యా.. టీమిండియా ఆటగాళ్లు ఎంఎస్ ధోని, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా, అక్షర్ పటేల్‌లతో కలిసి దిగిన ఫొటోను ట్వీటర్‌ పోస్ట్ చేశాడు.

మూడో వన్డే అనంతరం నాలుగో వన్డే కోసం జొహన్నెస్‌బర్గ్‌ వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్టులో ఫొటో దిగాడు. కేప్‌ టౌన్‌లో ముగిసింది.. జొహన్నెస్‌బర్గ్‌కు మళ్లీ వెళ్తున్నామంటూ పాండ్యా తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లకు చిరాకొచ్చింది. ఈ వన్డే సిరీస్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లో రాణించని పాండ్యా.. సెల్ఫీలు దిగి పోస్టులు పెట్టడం అభిమానులకు అంతగా రుచించలేదు. దీంతో మ్యాచ్‌లు ఆడేందుకు దక్షిణాఫ్రికా వెళ్లావా.. లేక సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు వెళ్లావా అంటూ పాండ్యాకు మొట్టికాయలు వేస్తున్నారు.


    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement