న్యూఢిల్లీ: క్రిస్ గేల్ విధ్వంసకర ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. తనదైన రోజున బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు గేల్. సిక్స్‌లను సరదాగా కొట్టేసి బౌలర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యధిక వ్యక్తిగత స్కోరు గేల్ పేరిటే ఉంది. 2013లో పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ 66 బంతుల్లో 175 పరుగులు కొట్టి రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అయితే గేల్‌కు బౌలింగ్ చేయడం తనకు కష్టంగా అనిపించదని అంటున్నాడు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈఎస్‌పీన్ క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నాడు భజ్జీ. (‘అతను మరో ధోని కావడం ఖాయం’)
ప్రధానంగా డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్‌లకు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఏ విధమైన బౌలింగ్ ప్రణాళికలు సిద్ధం చేసుకునేవారు అనే ప్రశ్నకు హర్భజన్ సమాధానమిచ్చాడు. ‘ గేల్‌కు వేగవంతమైన బంతుల్ని సంధిస్తే వాటిని అవలీలగా సిక్స్‌లుగా మలుస్తాడు. అది కాస్త స్లోగా బంతులు వేస్తే క్రీజ్ ముందకొచ్చి ఆడటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. స్లో బంతులను గేల్ సమర్ధవంతంగా ఆడలేడు. నేను ఎప్పుడూ గేల్‌కు బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడలేదు. స్వీప్ షాట్లు, మిడాన్ షాట్లను గేల్ ఆడలేడు. గేల్ ఈజీగా దొరికిపోతాడు. ఇక వార్నర్ విషయానికొస్తే బ్యాక్‌ఫుట్‌లో బాగా ఆడతాడు. కట్ షాట్స్ కూడా బాగుంటాయి. అదే సమయంలో స్విచ్ షాట్, స్వీప్ షాట్‌లను ఆడటంలో వార్నర్ సమర్ధుడు. వార్నర్ కవర్స్ మీదుగా బంతుల్ని హిట్ చేసే విధానం బాగుంటుంది. క్రీజ్‌కు ముందుకొచ్చినా తడబాటు ఉండదు. గేల్‌తో పోలిస్తే వార్నర్‌కు బౌలింగ్ చేయడమే చాలా కష్టం’ అని భజ్జీ తెలిపాడు.(‘నేను టాస్ ఓడిపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది’)
Comments
Please login to add a commentAdd a comment