మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 40 ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇలియట్(78), వెటోరి(9) క్రీజ్ లో ఉన్నారు. రాస్ టేలర్ 40, గప్టిల్ 15, విలియమ్సన్ 12 పరుగులు చేసి అవుటయ్యారు. మెక్ కల్లమ్, ఆండర్సన్, రోంచి డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, ఫాల్కనర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జాన్సన్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ తీశారు.