
33 పరుగులకు ఓపెనర్లు అవుట్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 33 పరుగులకు ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. గప్టిల్ 15 పరుగులు చేసి రెండో వికెట్ గా అవుటయ్యాడు. గప్టిల్ ను మ్యాక్స్ వెల్ అవుట్ చేశాడు. ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్.. స్టార్క్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. కివీస్ 12 ఓవర్లలో 38/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.