
బంగ్లాదేశ్ లక్ష్యం 146
కోల్కతా: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ 146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నికోలస్(7) వికెట్ ను ఆదిలోనే కోల్పోయింది. అయితే కెప్టెన్ విలియమ్సన్(42; 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) తనదైన దూకుడును కొనసాగించి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఆ తరువాత మున్రో(35), రాస్ టేలర్(28) లు మాత్రమే మోస్తరుగా రాణించారు. ఆపై బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ వరుస వికెట్లను కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది.
బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐదు వికెట్లు సాధించగా, అల్ అమిన్కు రెండు వికెట్లు దక్కాయి. ఇప్పటికే గ్రూప్-2 నుంచి న్యూజిలాండ్ సెమీస్ కు చేరగా, బంగ్లాదేశ్ నిష్క్రమించింది. దీంతో ఈ మ్యాచ్కు ఎటువంటి ప్రాధాన్యత లేదు.