
బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆతిథ్య జట్లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ మరో ఆలోచనకు తావులేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. రెండు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
ఈ మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని మెక్ కల్లమ్ చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా తమకు లభిస్తున్న మద్దతుతో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు. ఇదో గొప్ప ఫైనల్ మ్యాచ్ అవుతుందని పేర్కొన్నాడు. మైదానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులను తమ ఆటతో అలరిస్తామని ఆసీస్ మైఖేల్ క్లార్క్ చెప్పాడు.