
విజయవాడలో పీవీపీ-గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ!
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: భారత్‌కు బ్యాడ్మింటన్ హబ్‌గా మారిన హైదరాబాద్‌లోని నిమ్మగడ్డ ఫౌండేషన్ - గోపీచంద్ అకాడమీ తరహాలో విజయవాడలోనూ ఓ అకాడమీ ప్రారంభం కానుంది. ఐబీఎల్ చాంపియన్ హైదరాబాద్ హాట్‌షాట్స్ యజమాని ప్రసాద్ వి. పొట్లూరి దీనికి శ్రీకారం చుట్టారు.
తన సొంత ఊరు విజయవాడను స్పోర్ట్స్ హబ్‌గా మార్చాలని ఉందని... ఇందులో భాగంగా తొలుత పీవీపీ-గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని నగరంలో ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. అలాగే కానూరులోని ప్రసాద్ వి.పొట్లూరి ఇంజినీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ హంగులతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నట్లు తెలిపారు.