gopichand academy
-
గోపీచంద్ అకాడమీలో కరోనా కలకలం
హైదరాబాద్: నగరంలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కరోనా కలకలం రేగింది. గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న షట్లర్ సిక్కిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆమెతో పాటు ఫిజియోథెరపిస్ట్ కిరణ్ జార్జ్‌కు సైతం కరోనా వైరస్ సోకింది. వీరికి కరోనా లక్షణాలు కన్పించడంతో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో వీరిద్దరూ హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. అదే సమయంలో గోపీచంద్ అకాడమీని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు.. శానిటైజ్ చేశారు. కాగా, అదే అకాడమీలో స్టార్ షటర్లు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్‌లు ప్రాక్టీస్ చేస్తూ ఉండటంతో వారిలో ఆందోళన మొదలైంది. శాయ్ నిబంధనల మేరకు అకాడమీలోని అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి కరోనా టెస్టులు చేయనున్నారు. అయితే సిక్కిరెడ్డి, కిరణ్ జార్జ్‌లను కలిసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వీరితో ఎవరు ప్రైమరీ కాంటాక్ట్ అయ్యారో వారి వివరాలు సేకరిస్తున్నారు. సిక్కిరెడ్డి, కిరణ్ జార్జ్‌లకు మరొకసారి ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయనున్నారు.ఇప్పటికే పలువురు హాకీ ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకగా, క్రికెట్లో కూడా కరోనా కలవరం మొదలైంది. తాజాగా సిక్కిరెడ్డి, కిరణ్ జార్జ్‌లు కరోనా వైరస్ సోకడం క్రీడాకారుల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. -
అర్జున జాబితాలో రవీంద్ర జడేజా
గోపీచంద్ అకాడమీ ఆణిముత్యం, తెలుగుతేజం సాయిప్రణీత్‌కు భారత ప్రభుత్వం నుంచి ఘనమైన గుర్తింపు లభించనుంది. యేటికేడు తన రాకెట్ పదును పెంచుకుంటున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కు ‘అర్జున’ అవార్డు ఖాయమైంది. పారాలింపియన్ దీప మాలిక్ రెండో ‘ఖేల్‌రత్న’గా ఎంపిక కాగా... బ్యాడ్మింటన్ గురువు విమల్ కుమార్ ద్రోణాచార్యుడయ్యాడు. క్రికెటర్లు రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ అర్జునలుగా నిలిచారు. అయితే ఎప్పటిలాగే చిన్నపాటి అసంతృప్తుల సమేతంగానే ఈ సారి కూడా క్రీడా పురస్కారాల జాబితా వెలువడింది. న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారానికి మరో తెలుగు షట్లర్ ఎంపికయ్యాడు. భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంటాబయటా నిలకడగా రాణిస్తున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్ ప్రతిభను అవార్డుల కమిటీ గుర్తించింది. 2017లో ప్రణీత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నిలకడైన ప్రదర్శనతో సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. పారాలింపియన్ దీపా మాలిక్‌కు భారత అత్యున్నత క్రీడాపురస్కారం దక్కనుంది. రియో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన ఆమెను ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు నామినేట్ చేశారు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆ అవార్డుకు ఎంపికవగా ఈ ఏడాది సంయుక్తంగా ఇద్దరికి ఆ పురస్కారం లభించనుంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్‌లు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని అవార్డుల కమిటీ 19 మందిని ‘అర్జున’కు, ఇద్దరిని ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేసింది. మరో ముగ్గురిని ‘ద్రోణాచార్య’కు నామినేట్ చేసింది. దీపకు మూడో పురస్కారం పారా అథ్లెట్ దీప 2012లో అర్జున అవార్డు అందుకుంది. రెండేళ్ల క్రితం 2017లో భారత పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని దక్కించుకుంది. వరుసగా మూడు పారా ఆసియా గేమ్స్ (2010, 2014, 2018)లో పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. జకార్తా (2018) ఈవెంట్లో ఆమె డిస్కస్ త్రో, జావెలిన్ త్రోలో కాంస్యాలు గెలిచింది. గడిచిన నాలుగేళ్ల ప్రదర్శన ఆధారంగా ఇచ్చే ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఆమె అర్హురాలని కమిటీ నిర్ణయించింది. పూనియాతో పాటు ఆమెను ఎంపిక చేసింది. మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ ఐసీసీ ఈవెంట్లలో పరుగుల ప్రవాహం సృష్టించడంతో ‘అర్జున’కు ఎంపికైంది. మహిళల భారత జట్టు 2017లో వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్, గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. విమల్‌కు ద్రోణాచార్య సైనా నెహ్వాల్ మాజీ కోచ్ విమల్ కుమార్ ‘ద్రోణాచార్య’కు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్) కోచ్‌లకు ఇచ్చే పురస్కారానికి ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ భరద్వాజ్, మెర్జ్బన్ పటేల్, రణ్బిర్సింగ్ ఖోఖర్ జీవిత సాఫల్య పురస్కారాలకు నామినేట్ అయ్యారు. కమిటీ నామినీల జాబితాను కేంద్ర క్రీడాశాఖ ఆమోదించిన వెంటనే అధికారికంగా విజేతలను ప్రకటిస్తారు. యేటా హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 23)ని జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాష్ట్రపతి భవన్లో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఖేల్‌రత్న విజేతకు పతకంతో రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్యలకు మెమెంటో, రూ. 5 లక్షలు బహుమతిగా అందజేస్తారు. మేరీ తప్పుకుంది... భారత చాంపియన్ బాక్సర్ మేరీకామ్ అవార్డుల కమిటీలో ప్రధాన సభ్యురాలు. కానీ ఆమె శనివారం ‘ద్రోణాచార్య’ ఎంపికలో పాలుపంచుకోలేదు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ బాక్సర్ వ్యక్తిగత కోచ్ చోటేలాల్ యాదవ్ కూడా ‘ద్రోణాచార్య’ ప్రతిపాదిత జాబితాలో ఉన్నారు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దూరంగా ఉండాలని భావించిన ఆమె ఎంపిక ప్రక్రియ నుంచి స్వయంగా తప్పుకుంది. అవార్డు నామినీల జాబితా రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపామాలిక్ (పారా అథ్లెట్). అర్జున: సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), తేజిందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్ యాహియా, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), సోనియా లాతర్ (బాక్సింగ్), చింగ్లేశన సింగ్ (హాకీ), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), గౌరవ్‌సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), సుందర్‌సింగ్ గుర్జార్ (పారా అథ్లెట్), అంజుమ్ మోద్గిల్ (షూటింగ్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజ ధండ (రెజ్లింగ్), ఫౌవాద్ మిర్జా (ఈక్వెస్ట్రియన్), గుర్‌ప్రీత్‌సింగ్ సంధు (ఫుట్‌బాల్), సిమ్రన్‌సింగ్ షెర్గిల్ (పోలో). ఆర్డీటీకి పురస్కారం క్రీడలను ప్రోత్సహించడంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ సంస్థను అవార్డు కమిటీ ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’కు ఎంపిక చేసింది. ఐదు దశాబ్దాల క్రితం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’గా మొదలైన ఈ స్వచ్ఛంద సంస్థ మొదట్లో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం శ్రమించింది. కాలక్రమంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్‌గా మారాక గత 20 ఏళ్లుగా క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 2002లో స్పోర్ట్స్ సెంటర్‌ను ప్రారంభించింది. 32 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పరచింది. సకల సౌకర్యాలతో క్రీడలకు, క్రీడాకారులకు ఎనలేని సేవలందజేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన నిరుపేద బాలబాలికల్లో ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తోంది. ‘‘చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. రాబోయే టోర్నీల్లో మరింత పట్టుదలతో రాణించేందుకు ఈ అవార్డు ఊతమిస్తుంది’’ – ‘సాక్షి’తో సాయి ప్రణీత్ ‘‘మన దేశంలో తమవాళ్లకే అవార్డులు ఇచ్చుకుంటారు. అంటే కమిటీలో మనవారుంటే గుర్తిస్తారు. అంతే తప్ప ప్రదర్శనతోనూ, ప్రతిభతోనూ కాదు. ఇండియాలో ఇంతే. ఎవరేం చేయలేరు. మన పని మనం చేసుకోవాల్సిందే’’ – ట్విట్టర్లో హెచ్.ఎస్.ప్రణయ్ ఆవేదన ‘‘ఆటగాళ్ల విజయంలో కోచ్‌ల పాత్ర ఎంతో ఉంటుంది. నేను ఆ కోచ్‌ల వల్లే ఎదిగాను. జస్పాల్రాణా షూటింగ్లో ఉత్తమ కోచ్. మను భాకర్, సౌరభ్ చౌదరి, అనీశ్ భన్వాలాలను ప్రపంచశ్రేణి షూటర్లుగా తీర్చిదిద్దారు. అలాంటి రాణాను విస్మరించడం సరికాదు. ఇలాంటి తప్పటడుగులు టోక్యో ఒలింపిక్స్‌లో ప్రభావం చూపిస్తాయి’’ – ఒలింపిక్స్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా దీప, జడేజా, పూనమ్, అజయ్, బర్మన్ -
గోపీచంద్ అకాడమీలో మరో శిక్షణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌కు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో క్రీడాకారుల కోసం మరో శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ ఆవరణలో అదనంగా ఆరు ఎయిర్ కండిషన్డ్ కోర్టుల నిర్మాణం జరగనుంది. ఈ మేరకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ముందుకొచ్చింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే మూడేళ్ల కాలంలో రూ. 30 కోట్ల నుంచి రూ. 35 కోట్లు వెచ్చించి ఈ శిక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా తెలిపారు. ఈ కేంద్రంలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌ను కూడా నెలకొల్పుతామని, కోచ్‌లకు శిక్షణ కా ర్యక్రమాలు ఉంటాయని అన్నారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ సౌకర్యాలు లభిస్తే భారత ఆటగాళ్లు మున్ముందు మరిన్ని గొప్ప ఫలితాలు సాధిస్తారు. అంతర్జాతీయ మ్యాచ్‌లను ఎయిర్ కండిషన్డ్ కోర్టులలో నిర్వహిస్తారు. అకాడమీలో ఎయిర్ కండిషన్డ్ కోర్టులు ఉండాలని కోరుకున్నాం. త్వరలోనే వీటి నిర్మాణ పనులు మొదలవుతాయి. ఇందులో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తారు’ అని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. -
గోపీచంద్ మరో అకాడమీ
నయా రాయ్‌పూర్: బ్యాడ్మింటన్ క్రీడలో భారత్ పేరును విశ్వవ్యాప్తం చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్ ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లో కొత్త అకాడమీని ప్రారంభించారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ వంటి ఆణిముత్యాలను తీర్చిదిద్దిన ఆయన టాటా ట్రస్ట్స్ సహాయంతో రాయ్‌పూర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో ‘పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ’ని నెలకొల్పారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ చేతుల మీదుగా ఈ అకాడమీ భూమి పూజ సోమవారం చేశారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్‌తో పాటు కోచ్ సంజయ్ మిశ్రా, భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, టాటా ట్రస్ట్స్ ప్రతినిధులు ఆనంద్, నీలమ్, ఐటీఎం యూనివర్సిటీ చాన్స్‌లర్ పీవీ రమణ, వైస్ చాన్స్‌లర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ అకాడమీలో అత్యాధునికమైన బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, ఫిజియోథెరపీ న్యూట్రిషన్ ల్యాబ్, బయో మెకానిక్స్ ల్యాబ్స్‌తో పాటు కోచ్‌లు, సిబ్బందికి నివాస వసతిని ఏర్పాటు చేస్తారు. భారత జాతీయ జూనియర్ కోచ్ సంజయ్ మిశ్రా అకాడమీ బాధ్యతలను చూసుకుంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మాట్లాడుతూ ఛత్తీస్‌గడ్‌లో క్రీడాభివృద్ధికి గోపీచంద్ అకాడమీ దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రీడా ప్రతిభకు లోటు లేదన్న రమణ్ సింగ్ సరైన సమయంలో ఈ అకాడమీని ఏర్పాటు చేశారని అన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి అకాడమీ ఉండటంతో విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందుతారని అన్నారు. త్వరలోనే ఈ అకాడమీ నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రమణ్ సింగ్ మాటలతో ఏకీభవించిన కోచ్ గోపీచంద్ వచ్చే తరంలో స్టార్ ప్లేయర్లంతా ఛత్తీస్‌గఢ్ నుంచే వస్తారని అన్నారు. ఐటీఎం సహకారంతో చదువుతో పాటు సమాంతరంగా క్రీడలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌లో దూసుకుపోతున్న శ్రీకాంత్, ప్రణయ్ ఐటీఎం యూనివర్సిటీ బ్రాండ్ అంబాసిడర్లు కావడం విశేషం. యూనివర్సిటీలో అకాడమీ ఏర్పాటు చేయడం ఎంతోమంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని వారన్నారు. గోపీచంద్‌లాంటి గురువు పర్యవేక్షణలో ఐటీఎం యూనివర్సిటీ నుంచి చాంపియన్లు పుట్టుకొస్తారని విశ్వాసం కనబరిచారు. ప్రస్తుతం గోపీచంద్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తోపాటు పశ్చిమ గోదావరిలోని తణుకు, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, వడోదరల్లో అకాడమీలు నడుస్తున్నాయి. -
గోపీచంద్ గూటికి సైనా
-
మళ్లీ గోపీచంద్ అకాడమీకి సైనా
హైదరాబాద్: గడిచిన కొంత కాలంగా కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ గురువు గోపీచంద్ వద్దకే తిరిగి రానున్నట్లు, ఇందుకు ఆయన కూడా సమ్మతించినట్లు సైనా సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మూడేళ్ల కిందట.. మనస్పర్థల కారణంగా గోపీచంద్ అకాడమీని వీడిన సైనా.. బెంగళూరుకు చెందిన విమల్ వద్ద శిక్షణ తీసుకున్నారు. అయితే ఈ మూడేళ్ల కాలంలో ఆమె ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయారు. దీంతో తిరిగి గోపీ వద్దకే రావలనే నిర్ణయం తీసుకున్నారు. ‘‘గోపీచంద్ అకాడమీలో తిరిగి చేరాలని కొంతకాలంగా అనుకుంటున్నాను. ఇదే విషయాన్ని గోపీ సార్‌తో చెబితే, ఆయన మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. ప్రస్తుత తరుణంలో ఆయన శిక్షణ నా లక్ష్యాలకు నన్ను దగ్గర చేస్తుందనే నమ్మకం ఉంది’’ అని సైనా తెలిపారు. గడిచిన మూడేళ్లలో విమల్సార్ శిక్షణలోనూ తాను రాణించానని, వరల్డ్ నంబర్1 ర్యాంకును కైవసం చేసుకోవడమే కాక రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ పతకాలు, పలు సూపర్‌సిరీస్ టైటిల్స్ గెలుచుకున్నానని సైనా నెహ్వాల్ గుర్తుచేశారు. -
షట్లర్స్ ఫ్యాక్టరీ
చాంపియన్లను తయారు చేస్తున్న పుల్లెల గోపీచంద్ అకాడమీ - అన్ని స్థాయిలలో విజేతలుగా నిలుస్తున్న ఆటగాళ్లు - సంవత్సరాల శ్రమకు లభిస్తున్న ఫలితాలు - భవిష్యత్తులో మరింత మంది స్టార్లు అది హైదరాబాద్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ ప్రాంగణం... సుదీర్ఘంగా సాగిన ప్రాక్టీస్ తర్వాత లభించిన కొద్ది పాటి విరామ సమయం... ఆ కొద్ది సమయంలోనే తమ పరిచయం, తాము వచ్చిన కారణం, తమ ఆలోచనలను గోపీచంద్‌తో పంచుకునేందుకు పలువురు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అందులో ఎక్కువ మంది ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు. గోపీచంద్ అనుమతిస్తే అకాడమీతో జత కూడేందుకు... ఏదో రూపంలో స్పాన్సర్షిప్ అందజేసేందుకు వచ్చిన వారే. దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను వారు చర్చిస్తున్నారు. మరికొందరు ఆటగాళ్ల బ్రాండింగ్ గురించి, ఇతర ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాలని ఆశిస్తున్నారు. గోపీచంద్‌కు ఇటీవల ఇది రొటీన్‌గా మారిపోయింది. రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం నెగ్గిన తర్వాత ఇలాంటి వాటి కోసం ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి వస్తోంది. ఒకప్పుడు ఇదే అకాడమీ నిర్మాణం కోసం సహకారం కావాలంటూ ఆయన ఎక్కని, దిగని మెట్టు లేదు. అడగని కార్పొరేట్ సంస్థ లేదు. ఒక రకమైన లెక్కలేనితనంతో చిన్న చూపు చూసినవారు కొందరైతే... అసలు బ్యాడ్మింటన్‌ను ఎవరు పట్టించుకుంటారంటూ మొహం మీదే అనేసిన వారు మరెందరో. అయితే వారి మాటలు గోపీచంద్ లక్ష్యాన్ని మార్చలేదు. చాంపియన్లను తయారు చేయాలన్న తన పట్టుదల ముందు అవన్నీ చిన్న చిన్న విఘ్నాలుగా కనిపించాయే తప్ప... మనకెందుకులే ఇదంతా అంటూ కాడి పడేయాల్సినంతగా భయపెట్టలేదు. కష్టాలు, సమస్యలు ఎన్ని చెప్పుకున్నా... చివరకు ఫలితాలతోనే తనను ప్రపంచం అంచనా వేస్తుందని ఆయనకు బాగా తెలుసు. అందుకే వెనకడగు వేయలేదు. ఒక్కో అడుగు వేసుకుంటూ తన కలను నిజం చేసుకున్నారు. అకాడమీ నుంచి అత్యుత్తమ ఆటగాళ్లను తయారు చేయడంలో విజయవంతమయ్యారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్, సిక్కి రెడ్డి... ఈ జాబితా ఇంతటితో ఆగిపోలేదు. రుత్విక శివాని, మేఘన, రాహుల్ యాదవ్... తదితరులు దీనికి కొనసాగింపు... గాయత్రి, సామియా, విష్ణు...ఇది రాబోయే విజేతల వరుస... ఒకరా, ఇద్దరా బ్యాడ్మింటన్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న వారిలో ఎక్కువ మంది గోపీచంద్ అకాడమీ నుంచి వచ్చినవారే. భారత బ్యాడ్మింటన్‌కు కేంద్రంగా మారిన ఈ అకాడమీపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.... మొహమ్మద్ అబ్దుల్ హాది గోపీచంద్ 2004 నవంబర్‌లో ఆటగాడిగా ఆఖరి సారిగా ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ బరిలోకి దిగారు. హైదరాబాద్‌లోనే జరిగిన ఆసియా శాటిలైట్ టోర్నీలో విజేతగా నిలిచారు. అప్పటికే వరుస గాయాలకు పదే పదే జరిగిన శస్త్ర చికిత్సల తర్వాత పునరాగమనంలో గెలిచిన టైటిల్ అది. ఈ విజయం తర్వాత ప్రధాన టోర్నీలలో మళ్లీ గెలవడం సాధ్యం కాదని ఆయనకు అర్థమైంది. దాంతో ప్లేయర్‌గా కెరీర్ ముగిసింది. అదీ ఆరంభం... 2001లో గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌గా నిలిచే సమయానికి భారత్‌లో బ్యాడ్మింటన్‌కు సౌకర్యాల పరంగా అనుకూల వాతావరణం ఏమీ లేదు. తర్వాతి మూడేళ్లలో కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్‌లో కూడా ఎల్బీ ఇండోర్ స్టేడియం మినహా మరో చెప్పుకోదగ్గ వేదిక లేదు. ఇలాంటి స్థితిలో ఆడిన గోపీచంద్... మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ఇంకా ఎక్కువ మంది బ్యాడ్మింటన్‌లో వెలుగులోకి రావొచ్చని నమ్మారు. అదే ఆలోచనతో కోచ్‌గా మారి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సహకారంతో... 2004లోనే అప్పటి ‘శాప్’ మేనేజింగ్ డైరెక్టర్ సుమితా దావ్రా చొరవ చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గోపీచంద్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చారు. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం వైపు నుంచి ఏడాదికి రూ. 10 లక్షల చొప్పున ఇచ్చేందుకు కూడా అంగీకరించారు. ఇందులో పెద్ద మొత్తం ఇండోనేసియా కోచ్‌కే చెల్లించాల్సి వచ్చేది. కొంత మంది వర్ధమాన షట్లర్లు, కొత్తవారితో కలిసి 30 మందితో అకాడమీ ప్రారంభమైంది. సంవత్సరం పాటు ప్రభుత్వ నిధులతో అకాడమీ నడిచింది. కానీ ఆ తర్వాత ఆ మొత్తాన్ని కొనసాగించేందుకు వేర్వేరు కారణాలతో ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ దశలో గోపీచంద్ సొంత డబ్బులతోనైనా అకాడమీని నడిపించాలని పట్టుదల ప్రదర్శించారు. 2008 వరకు సొంత డబ్బును ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అత్యుత్తమంగా... ప్రపంచ స్థాయి కోర్టులు, శిక్షణ, జిమ్, ఫిజియోలు, డైటింగ్... ఇలా ప్రతీ అంశంలో గోపీచంద్ అకాడమీ సౌకర్యాలపరంగా ‘ది బెస్ట్’గా నిలుస్తుంది. పదేళ్ల వయసు ఉన్న చిన్నారుల నుంచి రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు వరకు ప్రస్తుతం అందరికీ ఇక్కడ శిక్షణ కొనసాగుతోంది. 2008లో ఏర్పాటైన అకాడమీకి తోడు అవుటర్ రింగ్‌రోడ్ జంక్షన్ సమీపంలో 2016లో భారత క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో గోపీచంద్ రెండో అకాడమీ కూడా ఏర్పాటైంది. రెండు అకాడమీల్లో కలిపి 150 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఆటగాళ్లందరినీ మొత్తం 6 గ్రూప్‌లుగా విభజించారు. సింధు, శ్రీకాంత్ తదితర ఆటగాళ్ల కోచింగ్ గోపీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. గోపీ కాకుండా మరో 15 మంది కోచ్‌లు పని చేస్తున్నారు. వీరంతా మిగతా గ్రూప్‌లలోని ఆటగాళ్లకు కోచింగ్ ఇస్తారు. నోయిడాలో కూడా... హైదరాబాద్‌లో గోపీచంద్ అకాడమీ సూపర్ సక్సెస్ తర్వాత దేశవ్యాప్తంగా కూడా తమ వద్ద అలాంటి అకాడమీలు ఏర్పాటు చేయాలని, ఎంత డబ్బయినా వెచ్చిస్తామని ఆయనకు అనేక ఆఫర్లు వచ్చాయి. అయితే అందులో చాలా వాటిని గోపి తిరస్కరించారు. ‘వీళ్లంతా ఇలా పెట్టుబడి పెట్టగానే అలా లాభం మొదలు కావాలని భావించేవాళ్లే. క్రీడల్లో అది సాధ్యం కాదు. దానిని పక్కా వ్యాపార దృష్టితో వారు చూశారు. అందుకే అంగీకరించలేదు’ అని గోపీచంద్ చెప్పారు. తన ఆలోచనలకు తగినట్లుగా, కేవలం మంచి ఫలితాలు రావాలనే నమ్మకంతో ముందుకు వచ్చిన వారితో కలిసి న్యూఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆయన అకాడమీని ఏర్పాటు చేశారు. గోపీచంద్ పేరును జోడిస్తూ గ్వాలియర్, వడోదర, తణుకు, సేలంలలో కూడా అకాడమీలు ఉన్నా... వాటిలో ఆయన భాగస్వామ్యం లేదు. అవసరమైనప్పుడు ఆయన తగిన మార్గనిర్దేశనం చేస్తుంటారు. లండన్ ఒలింపిక్స్ తర్వాతే 2008లో అకాడమీ ప్రారంభమైనా నిర్వహణ కోసం చెప్పుకోదగ్గ మద్దతు లభించలేదు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఇక్కడ మెరికల్లాంటి షట్లర్లను తయారు చేసే అవకాశం ఉందని అంతా గుర్తించారు. భవిష్యత్తు విజయాల్లో తాము కూడా భాగం కావాలని అనేక కంపెనీలు భావించాయి. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ కూడా ఆ తర్వాత భాగంగా మారింది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఆసక్తి కనబర్చాయి. ఇక స్పోర్ట్స్ అథారిటీ, భారత బ్యాడ్మింటన్ సంఘం రెగ్యులర్‌గా జాతీయ జట్టు శిక్షణ శిబిరాలు ఇక్కడే ఏర్పాటు చేయడంతో అకాడమీకి ఆర్థిక భారం తగ్గింది. ఇక గత ఏడాది ‘రియో’లో సింధు పతకం తర్వాతనైతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీర్ఘకాలిక లక్ష్యాలు... ఇప్పుడు అకాడమీ నుంచి వరుస విజయాలతో కీర్తి కనకాదులు సొంతం చేసుకుంటున్నవారు ఒక్క రోజులో స్టార్లుగా మారిపోలేదు. ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల వాటి వెనక ఉన్నాయి. గోపీచంద్ కూడా అందరికీ ఇదే చెబుతారు. కఠోర ప్రాక్టీస్, సరైన డైట్, రోజూవారీ క్రమశిక్షణ... ఈ మూడింటిని ఒక వారమో, నెల రోజులో కాకుండా కనీసం పదేళ్ల పాటు ఒకే తరహాలో కొనసాగించగలవారు మాత్రమే ఆటలోకి అడుగు పెట్టాలి. ఇన్‌స్టంట్‌గా కాకుండా సుదీర్ఘ లక్ష్యాలతో శ్రమిస్తేనే ఫలితాలు ఆశించవచ్చు. అంతే కానీ ఉత్సాహంతో రావడం, కొద్ది రోజులకే ఇంకా చాంపియన్ కావడం లేదని భావిస్తే ఏ అకాడమీ కూడా ఏమీ చేయలేదు అని ఆయన అంటారు. నిధుల వేటలో... అకాడమీ నిర్మాణం కోసం అప్పటికే గోపీచంద్‌కు ప్రభుత్వం 5 ఎకరాల స్థలం కేటాయించినా... ఆర్థిక సమస్యలతో అటువైపు దృష్టి పెట్టలేదు. అయితే 2006లో జాతీయ జట్టు చీఫ్ కోచ్‌గా ఎంపికయ్యాక శిక్షణ పరిధి మరింత పెరిగింది. మరోవైపు ప్రభుత్వానికి చెందిన గచ్చిబౌలి అకాడమీలో నిర్వహణ గురించి కొన్ని సమస్యలు తలెత్తాయి. దాంతో అన్ని సౌకర్యాలతో కొత్త అకాడమీని నిర్మించాలని గోపీచంద్ నిర్ణయించుకున్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అండగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అప్పటికి కొద్ది రోజుల క్రితమే కట్టుకున్న ఇల్లును గోపీచంద్ కుదువ పెట్టారు (2012లో ఈ అప్పు తీరింది). అయితే ఆ మొత్తం ఏమాత్రం సరిపోలేదు. చివరకు ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అండగా నిలవడంతో గోపీచంద్ కల సాకారమైంది. ఆయన రూ. 4.5 కోట్లు అకాడమీ కోసం ఇచ్చారు. చివరకు 2008లో నిమ్మగడ్డ ఫౌండేషన్–పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభమైంది. క్రీడా పరికరాల ఉత్పత్తుల్లో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన ‘యోనెక్స్’ మొదటి నుంచీ అకాడమీకి అండగా నిలుస్తోంది. ఇక్కడి ఆటగాళ్ల శిక్షణ కోసం పెద్ద సంఖ్యలో అవసరమైన షటిల్స్‌ను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు గుర్తింపు తెచ్చుకున్న షట్లర్లకు పూర్తి స్థాయిలో కిట్ కూడా అందజేస్తోంది. ఇది తమపై ఆర్థిక భారాన్ని తగ్గించిందని గోపీచంద్ చెబుతారు. అంతా బాగున్న సమయంలో కొంత మంది తప్పుదోవ పట్టించిన కారణంగా మధ్యలో ఒకసారి భూమి వెనక్కి ఇమ్మంటూ ప్రభుత్వం నుంచి నోటీసు వచ్చింది. దాని కోసం కోర్టులో పోరాడాల్సి వచ్చింది. చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు అధికారికంగా పూర్తి స్థాయిలో అకాడమీ భూమి మా చేతికొచ్చింది. సమస్యలను అధిగమించి దీనిని సమర్థంగా నడిపించడంలో గవర్నర్ నరసింహన్‌తో పాటు ఐఏఎస్ అధికారులు ఎస్పీ సింగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కమల్‌వర్ధన్ రావు ఎంతో సహకరించారు అని గోపీచంద్ అన్నారు. ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోలేదు... ‘సొంత అకాడమీ ఉంటూ జాతీయ జట్టు చీఫ్ కోచ్‌గా ఎలా పని చేస్తావు’ అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. నిజానికి అది నాకు ఒక పదవి మాత్రమే. హోదా ఎలా ఉన్నా అత్యుత్తమ ఆటగాళ్లను తయారు చేయడమే నా పని. ఏ అకాడమీ నుంచి ఆటగాళ్లు వచ్చినా చివరకు వారు భారతదేశానికే ప్రాతినిధ్యం వహిస్తారు. దేశం కోసం పతకం గెలుస్తారు. అది ముఖ్యం. అకాడమీ కోచ్, భారత కోచ్ రెండింటినీ నేను సమన్వయపరుస్తూ వెళ్లానే తప్ప ప్రత్యేకంగా సొంత ప్రయోజనాలకు వాడుకోలేదు. అజయ్ జయరామ్ అగ్రశ్రేణి ఆటగాడు. అతను నా అకాడమీలో కాకుండా సొంతంగా ముంబైలో ప్రాక్టీస్ చేసుకుంటాడు. కానీ భారత కోచ్‌గా అతడికి నేను నా వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం అందిస్తాను. అంతే గానీ నా అకాడమీ షట్లర్ కాదని నేను భావించను. అన్నింటికి మించి అందరికి తెలియని విషయం ఏంటంటే నేను గత 11 ఏళ్లలో భారత కోచ్ హోదాలో ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. ఇండియన్ ఆయిల్లో ఉద్యోగిగా నాకు వచ్చే జీతం, నా భార్య లక్ష్మి జీతంతో పాటు మా నాన్నగారి ఆదాయాన్ని మేం పూర్తిగా వాడుకున్నాం. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొంతున్న వారిలో 70 శాతం మంది నుంచి నేను ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు. కార్పొరేట్లు ఇచ్చే సహకారంతోనే దానిని భర్తీ చేస్తున్నాను. అకాడమీ నిర్వహణ అనేది నాకు ఎప్పుడూ ఆదాయ వనరు కాదు. అలా ఆలోచించి దీనిని మొదలు పెట్టలేదు. ఆయన పిల్లలు కూడా... తల్లిదండ్రుల బాటలోనే గోపీచంద్, లక్ష్మీల ఇద్దరు పిల్లలు కూడా బ్యాడ్మింటన్‌పైనే దృష్టి పెట్టారు. ఇతర ట్రైనీలతో పాటు వీరిద్దరు కూడా అకాడమీలోనే శిక్షణ తీసుకుంటున్నారు. నిబంధనల విషయంలో వారికీ ఎలాంటి వెసులుబాటు ఉండదని గోపి చెప్పారు. కూతురు గాయత్రి జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక టైటిల్స్ సాధించి తన ప్రత్యేకత ప్రదర్శించగా... కుమారుడు సాయి విష్ణు కూడా అదే బాటలో ఉన్నాడు. ప్రపంచంలో నంబర్‌వన్... గోపీచంద్ అకాడమీ నుంచి పెద్ద ఎత్తున ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. సైనా నెహ్వాల్, పీవీ సింధులు ఒలింపిక్ పతకాలతో చెలరేగితే... మిగతా వారంతా అనేక పెద్ద స్థాయి అంతర్జాతీయ టోర్నీలలో విజేతలుగా నిలిచి సత్తా చాటారు. ఈ విజయాల వరుసకు బ్రేక్ రాకుండా గోపీచంద్ జాగ్రత్త తీసుకుంటారు. అగ్రశ్రేణి ఆటగాళ్ల శిక్షణపైనే పూర్తిగా దృష్టి పెట్టకుండా తర్వాతి స్థాయి బృందంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఒకవేళ సీనియర్లు విఫలమైనా ఆ లోటు కనిపించకుండా... తర్వాతి వారు దానిని అందుకునే విధంగా వారికి కోచింగ్ ఇస్తారు. దాని వల్ల మళ్లీ అండర్–13 నుంచి సీనియర్ విభాగం వరకు ఎక్కడా విజయాలకు విరామం లభించదు. చైనాలో 50 అకాడమీలు ఎంతో మంది ఆటగాళ్లను తయారు చేస్తున్నాయి. కానీ ఒకే అకాడమీ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ షట్లర్లు రావడం ఎక్కడా జరగలేదు. సౌకర్యాలు, ఫలితాలపరంగా ప్రపంచంలోనే మా అకాడమీ నంబర్‌వన్ అని గట్టిగా చెప్పగలను. ఆ విషయంలో నేను గర్వపడుతున్నాను అని గోపీచంద్ చెబుతారు. గోపీ పరీక్ష తర్వాతే... సహజంగానే గోపీచంద్ అకాడమీకి ఇప్పుడు ఉన్న గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. దాంతో తమ పిల్లలు అక్కడ చేరితే చాంపియన్లుగా మారతారనే భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అందుకే నేరుగా తీసుకొచ్చి అకాడమీలో చేర్పించేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. అయితే గోపీచంద్ చెప్పిన దాని ప్రకారం... గత మూడేళ్లుగా అకాడమీలో దాదాపుగా అడ్మిషన్లు ఆగిపోయాయి. బేసిక్స్ నేర్చుకునే లెర్నర్స్ విభాగంలోనైతే ఎవరినీ తీసుకోవడం లేదు. కొంత మంది పెద్ద స్థాయి సిఫారసులతో వచ్చినా సరే వారికి కూడా నో ఎంట్రీనే. అయితే ప్రాథమిక స్థాయిలో అప్పటికే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చిన వారిని తీసుకొని మరింతగా సానబెట్టే అవకాశం మాత్రం ఇక్కడ ఉంది. అదీ గోపీచంద్ స్వయంగా తనదైన శైలిలో ఆటలో పరీక్ష నిర్వహించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే వారికి అవకాశం లభిస్తుంది. అసాధారణ ప్రతిభ ఉందంటూ వచ్చే కొందరికి కూడా ఇదే వర్తిస్తుందని ఆయన అంటున్నారు. క్రమశిక్షణకు కేరాఫ్... అగ్రశ్రేణి క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకొని ఉండవచ్చు... అప్పటికే పెద్ద టోర్నీలలో వరుస విజయాలు సాధిస్తూ ఉండవచ్చు... కానీ అకాడమీలో క్రమశిక్షణ విషయానికి వచ్చేసరికి మాత్రం అంతా ఒక్కటే. ఏ ఒక్కరూ తమ పరిధి దాటి ప్రవర్తించేందుకు ఏమాత్రం అవకాశం లేదు. తమకు ఇచ్చిన షెడ్యూల్‌ను కచ్చితంగా, సమర్థంగా పాటించాల్సిందే. ఇన్నేళ్లలో క్రమశిక్షణకు సంబంధించి అకాడమీ నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం విశేషం. తాను కూడా ఈ అంశంలో కఠినంగా వ్యవహరిస్తానని గోపీచంద్ అన్నారు. సాధారణంగా ఇలాంటి వ్యవస్థలో వాతావరణం చెడగొట్టేవారు ఒకరో, ఇద్దరో కచ్చితంగా ఉంటారు. అలాంటి వారిని గుర్తించి పక్కన పెట్టేయడం చాలా అవసరం. ఇక్కడ ట్రైనింగ్ కూడా పూర్తిగా నేను ఇచ్చిన ప్రణాళిక ప్రకారమే సాగాలి. కొంత మంది ఆటగాళ్లు బయట గెలిచి రాగానే ఇలా కాదు అలా ఆడాలి అన్నట్లుగా తమ షెడ్యూల్ తామే మార్చుకునే ప్రయత్నం చేస్తారు. లేదంటే జూనియర్లకు సలహాలిస్తూ మాస్టర్లా మారే ప్రయత్నం చేస్తారు. కానీ అలా ప్రవర్తిస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించే అవకాశం నేను అసలే ఇవ్వను అని ఆయన చెప్పారు. -
సింధుకు సచిన్ 'బీఎండబ్ల్యూ' కానుక!
-
గోపి ఫ్యాక్టరీ
-
' పుల్లెల గోపిచంద్ రియల్ హీరో: సచిన్'
-
'ప్రోత్సాహం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు'
-
పుల్లెల గోపిచంద్ రియల్ హీరో: సచిన్
♦ గోపిచంద్ గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారుడు: సచిన్ ♦ పీవీసింధు, సాక్షిమాలిక్, దీపాకర్మాకర్, గోపిచంద్‌లకు బీఎండబ్ల్యూ కార్ల బహుమానం ♦ ఒలింపిక్ విజేతలతో సెల్ఫీ దిగిన సచిన్ హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపిచంద్ 'రియల్ హీరో' అంటూ దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకు ఆదివారం గోపిచంద్ అకాడమీలో సచిన్ బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గోపిచంద్ అకాడమీకి చేరుకున్న సచిన్.. పీవీ సింధు, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్ లకు ఆయన చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్ వారిని హృదయపూర్వకంగా అభినందించారు. వీరితో పాటు కోచ్ గోపిచంద్‌కు కూడా బీఎండబ్ల్యూ కారును సచిన్ బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్ సింధు, గోపిచంద్, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్లతో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం సచిన్ మాట్లాడుతూ.. కఠోర సాధనతోనే మెడల్స్ సాధించగలిగారని ప్రశంసించారు. వీరిని చూసి భారత్ ఎంతో గర్విస్తోందని కొనియాడారు. మరిన్ని మెడల్స్ సాధించే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పీవీ సింధు, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్, గోపిచంద్‌లకు సచిన్ కారు తాళాలు అందజేశారు. కాగా, రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తామని ముందే బ్యాడ్మింటన్ వైస్ ప్రెసెడెంట్ చాముండేశ్వరినాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రజత పతకం సాధించిన తెలుగు అమ్మాయి, షెట్లర్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ.. నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒలింపిక్ మెడల్ సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. రెజ్లర్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరెన్నీ పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో వచ్చినా.. ఇంత ప్రోత్సాహం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటానని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చెప్పింది. -
'మెడల్ సాధించినందుకు సంతోషంగా ఉంది'
-
నేను అలా అనలేదు: మహమూద్ అలీ
ఒలింపింక్స్‌లో భారత్‌కు రజత పతకాన్ని సాధించిన ‘సింధూ’ దేశానికే గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. అటువంటి సింధూను మనకిచ్చిన కోచ్ పుల్లెల గోపిచంద్ దేశం గర్వించదగ్గ కోచ్ అని ఆయన కొనియాడారు. వందమంది సింధూలను తయారు చేయగలిగిన సత్తా కోచ్ గోపిచంద్‌కు ఉందన్నారు. గోపిచంద్ మరో అకాడమీని స్థాపించే ఆలోచన ఉంటే సహకరిస్తానని మాట్లాడిన మాటలను మీడియా వేరే విధంగా చిత్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లో జరిగిన ఓ పత్రికా ఆవిష్కరణ సభలో ఆయన పై విధంగా స్పందించారు. మీడియా అంటే తనకు ఎంతో అభిమానం ఉందన్నారు. రజత పథకం సాధించిన సందర్భంగా సింధూకు నిర్వహించిన సన్మాన సభలో గోపించంద్ భారత్ గర్వించదగ్గ కోచ్ అని, మరో అకాడమీ స్థాపించే ఆలోచన ఉంటే తాను సహకరిస్తానని చెప్పానన్నారు. గోపిచంద్ ఆధ్వర్యంలో మంచి టీమ్‌ను ఇచ్చేందుకు తన వంతు సాయం చేస్తానని సభా ముఖంగా తెలిపానన్నారు. వంద మంది సింధూలను తయారు చేసి దేశానికి పేరు ప్రఖ్యాతలు తేగలిగిన సత్తా ఒక్క గోపించంద్‌కు ఉందన్నారు. ఈ వ్యాఖ్యలను మీడియా మరోలా చిత్రీకరించడంతో దేశవ్యాప్తంగా తను విమర్శలను ఎదుర్కొనడం జరిగిందన్నారు. ఇటివల నీటి ఒప్పందాలపై మహరాష్ట్ర వెళ్లినప్పుడు అక్కడ మీడియా కూడా ఇదే విషయంపై ప్రశ్నించడం బాధ కలిగించిందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కనే ఉండి స్పందించడంతో ఉపశమనం పొందానన్నారు. ఒక వార్త రాసేప్పుడు సరైన ఆధారాలతో రాస్తే సమాజానికి మేలు కలుగుతుందన్నారు. ఎల్లప్పుడూ గోపించద్కు అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. -
ఈ వెలుగుల వెనుక ఓ ‘శక్తి’
సింధు పతకం గెలవగానే ఎవరికి వాళ్లు ‘మా వల్లే మా వల్లే’ అంటూ లేని గొప్పతనాన్ని తమకు ఆపాదించుకుంటున్నా... హైదరాబాద్ బ్యాడ్మింటన్ హబ్‌గా మారడం వెనక గోపీచంద్ ఆలోచనతో పాటు ఓ బలమైన ‘శక్తి’ సహకారం ఉంది. కేవలం స్నేహం కోసం ఆ రోజుల్లోనే ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ శక్తి పేరు నిమ్మగడ్డ ప్రసాద్. ఆ రోజుల్లో ఆయన ఇచ్చిన ఆర్థిక సహకారం వల్లే ఈ రోజు బ్యాడ్మింటన్ ఈ స్థాయిలో నిలబడగలిగిందంటే అతిశయోక్తి కాదు. * స్నేహం కోసం అకాడమీకి డబ్బు ఇచ్చిన నిమ్మగడ్డ ప్రసాద్ * 2003లోనే ఐదు కోట్ల రూపాయలు సహాయం సాక్షి క్రీడావిభాగం: గోపీచంద్ దగ్గర స్థలం ఉంది... అకాడమీ ఎలా నిర్మించాలనే ఆలోచన ఉంది... ప్రపంచస్థాయి వసతులతో మంచి అకాడమీ నిర్మిస్తేనే గొప్ప ఫలితాలు వస్తాయి... కానీ చేతిలో డబ్బు లేదు... తన అకాడమీ కల సాకారం కావాలంటే కనీసం నాలుగు కోట్ల రూపాయలు కావాలి... ఎలా..? 2003లో గోపీచంద్ అకాడమీ నిర్మాణానికి పూనుకున్న సమయంలో ఉన్న పరిస్థితి ఇది. ప్రభుత్వం స్థలం అయితే ఇచ్చిందిగానీ అకాడమీ నిర్మాణానికి డబ్బు మాత్రం ఇవ్వదు. ఈ సమయంలో ఒక కార్పొరేట్ సంస్థను కలిసి ఆయన తన ప్రయత్నాన్ని వెల్లడించారు. ఒకసారి తేరిపార చూసిన ఆయన... ‘మన దేశంలో బ్యాడ్మింటన్‌ను ఎవరు పట్టించుకుంటారండీ’ అంటూ ఒక వ్యంగ్య విమర్శ చేశాడు. ఇలాంటి సమయంలో ప్రసాద్‌ను కలిసి గోపి అకాడమీ గురించి వివరించి, నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అప్పటికే వ్యాపారంగంలో బాగా ఎదిగిన ప్రసాద్... ఏ మాత్రం ఆలోచించకుండా సహాయం చేశారు. రెండు కోట్ల రూపాయలు డొనేషన్‌గా ఇచ్చారు. మరో రెండు కోట్లు ఇస్తామని చెప్పిన వేరేవాళ్లు ఎంతకీ ఇవ్వలేదు. దీంతో మిగిలిన రెండు కోట్లు కూడా ప్రసాద్ ఇచ్చేశారు. అకాడమీ పూర్తయినా నిర్వహణకు డబ్బులు లేక మళ్లీ కష్టాలు ఎదురయ్యాయి. ఈ సమయంలో ప్రసాద్ మరో కోటి రూపాయలు ఇచ్చేశారు. దీంతో అకాడమీ సాఫీగా నడిచింది. అందుకే గోపీ ఈ అకాడమీకి ‘నిమ్మగడ్డ ఫౌండేషన్ గోపీచంద్ అకాడమీ’ అని పేరు పెట్టాడు. ఎంత డబ్బున్నా ఐదు కోట్ల రూపాయలు ఊరికే ఇవ్వడం అంటే చాలామందికి మనసు రాదు. నిజానికి 13 సంవత్సరాల క్రితం ఇది చాలా పెద్ద మొత్తం. మరి ప్రసాద్ ఎందుకు ఇచ్చారు..? దీనికి సమాధానం స్నేహం. గోపీ బ్యాడ్మింటన్ స్టార్ కాకముందే ప్రసాద్, గోపీ తండ్రి స్నేహితులు. ఎల్బీ స్టేడియంకు సమీపంలోని ఒక ఇంట్లో పక్క పక్క పోర్షన్లలో ఉండేవారు. సహజంగానే మధ్య తరగతి కుటుంబాల్లో పెరిగే స్నేహం... పక్కపక్కన ఉన్న ఈ ఇద్దరి కుటుంబాలకూ పెరిగింది. ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతల దృష్యా గోపీ తండ్రి నిజామాబాద్ వెళ్లిపోయారు. ఇటు ప్రసాద్ మ్యాట్రిక్స్ లేబోరేటరీస్ ద్వారా ఉన్నతస్థితికి వెళ్లారు. ఎంత ఎదిగినా ఆ కుటుంబాల మధ్య స్నేహం మాత్రం అలాగే కొనసాగింది. ఆటలపై మొదటి నుంచి ఆసక్తి చూపే ప్రసాద్... గోపీ అకాడమీ ప్రతిపాదనతో రాగానే వెంటనే సహాయం చేశారు. గత పుష్కర కాలంలో నగరంలో బ్యాడ్మింటన్ బాగా అభివృద్ధి చెందింది. క్రమంగా గోపీచంద్ అకాడమీ అనే పేరుతోనే అందరూ గుర్తుంచుకున్నారు. కానీ ఇప్పటికీ, ఎప్పటికీ ఆ అకాడమీ పేరు ‘నిమ్మగడ్డ ఫౌండేషన్ గోపీచంద్ అకాడమీ’. ప్రపంచస్థాయి అకాడమీ నిర్మిస్తానని గోపీ వచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది. మళ్లీ నాకు డబ్బు తిరిగి ఇవ్వొద్దు. ఒక ఒలింపిక్ పతకం తెచ్చి చూపించండి అని అడిగాను. కచ్చితంగా తెస్తానని మాట ఇచ్చాడు. 2012లోనే సైనా రూపంలో గోపీ పతకం తెచ్చాడు. ఇప్పుడు సింధు రజతం తెచ్చేసింది. నాకు ఇచ్చిన మాట నిలుపుకున్నాడు. భారత్‌కు ఒలింపిక్ పతకం మన అకాడమీ నుంచి రావడం గర్వకారణం’ - నిమ్మగడ్డ ప్రసాద్ ఆటల పట్ల ఆసక్తి క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా గతంలో ప్రసాద్ ఎప్పుడూ ఆటలకు సంబంధించిన వ్యాపారంలోకి రాలేదు. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించే వ్యక్తిగా వ్యాపార వర్గాల్లో పేరున్న ప్రసాద్... ఇప్పుడు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ ద్వారా ఇందులోకి వచ్చేశారు. సచిన్ టెండూల్కర్ యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టులో ప్రసాద్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ కలిసి వాటాలు కొన్నారు. భవిష్యత్తులోనూ క్రీడల్లో మరింతగా భాగం కావాలని ఆయన భావిస్తున్నారు. ‘నా చిన్నతనంలో నేను క్రికెట్ ఆడుకోవడానికి వెళితే మా నాన్న బ్యాట్ విరగ్గొట్టి చదువుకోమన్నారు. అప్పటితరంలో చదువుకే ప్రాధాన్యత. కానీ ఇప్పుడు ప్రాధాన్యతలు మారాయి. స్పోర్ట్స్ కూడా ప్రొఫెషనల్‌గా మారాయి. ఒక ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆ చుట్టూ ఉన్న పది ఇళ్లలో పిల్లలు కూడా అదే మార్గంలో వచ్చి ఉద్యోగాలు వెతుక్కుంటారు. ఇప్పుడు సింధు విజయం సాధించిన తర్వాత మరింత మంది బ్యాడ్మింటన్‌లోకి వస్తారు’ అని ప్రసాద్ అన్నారు. -
గోపిచంద్ అకాడమిలో బిగ్‌స్క్రీన్
మరి కొద్ద సేపట్లో జరగబోయే రియో ఒలింపిక్ బ్యాడ్మెంటన్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు యావత్ భారత దేశం ఉవ్విల్లూరుతోంది. ఈ నేపథ్యంలో పీవీ సింధూ కోచింగ్ తీసుకున్న గోపిచంద్ అకాడమిలో లైవ్ మ్యాచ్ చూడటానికి తగిన బిగ్ స్క్రీన్‌ను ఏర్పాట్లు చేశారు. స్వర్ణం కోసం భారీ ర్యాలీ.. విజయవాడ రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధూ స్వర్ణం సాధించాలని కోరుతూ విజయవాడలో బ్యాడ్మెంటెన్ క్రీడాకారులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒలంపిక్స్‌లో సింధూ సత్తా చాలాలంటూ సింధూ ఫ్లెక్సీలతో ప్రదర్శన జరిపారు. క్రిడాభిమానులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. -
గోపీచంద్ అకాడమీనే స్ఫూర్తి!
- సొంత శిక్షణా కేంద్రం ఏర్పాటుపై లక్ష్మణ్ వ్యాఖ్య - మంచి ఫలితాలు సాధిస్తామన్న మాజీ క్రికెటర్ సాక్షి, హైదరాబాద్: అకాడమీ ఏర్పాటు చేసి భవిష్యత్తు క్రీడాకారులను తయారు చేయాలన్న తన కోరికకు బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ ప్రేరణగా నిలిచాడని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. అతనిలాగే తాను అంకిత భావంతో పని చేసి ఫలితాలు సాధిస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘గతంలో ఎంతో మంది ఆటగాళ్లు అకాడమీలు ఏర్పాటుచేసి సరైన ఫలితాలు రాబట్టడంతో విఫలమయ్యారు. కానీ పుల్లెల గోపీచంద్ మాత్రం ఎంతో పట్టుదలతో, అంకితభావంతో పని చేసి ఈ రంగంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. అదే నాకు స్ఫూర్తినిచ్చింది. బ్యాడ్మింటన్‌లో అతని అకాడమీ ద్వారా ఎంత మంది స్టార్లు వెలుగులోకి వచ్చారో అదే తరహాలో నా క్రికెట్ అకాడమీ నుంచి విజయాలు దక్కాలని ఆశిస్తున్నా’ అని లక్ష్మణ్ అన్నాడు. ఏప్రిల్ 4న వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించనున్న నేపథ్యంలో లక్ష్మణ్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. తాను అకాడమీ ఏర్పాటు కోసం ఎలాంటి మౌలిక సౌకర్యాల గురించి ఆలోచించానో, అవన్నీ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్లో సిద్ధంగా ఉండటంతో వెంటనే ప్రారంభిస్తున్నట్లు ఈ మాజీ క్రికెటర్ వెల్లడించాడు. నగరంలో శిక్షకులుగా ప్రత్యేక గుర్తింపు ఉన్న అశోక్ సింగ్, విన్సెంట్ వినయ్ కుమార్, రమేశ్ ఈ అకాడమీలో ప్రధాన కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించనుండగా మరికొందరు యువ కోచ్‌లు సహకరిస్తారు. ఏప్రిల్ 4 నుంచి మే 31 వరకు రెండు నెలల పాటు ఇక్కడ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. ఉదయం ఒక సెషన్, సాయంత్రం మరో సెషన్ నిర్వహిస్తుండగా.. ఒక్కో సెషన్లో వంద మంది వరకు శిక్షణకు అవకాశం ఉంది. ఇందు కోసం రూ.10 వేల చొప్పున ఫీజు నిర్ధారించారు. అత్యుత్తమ సౌకర్యాలతో... దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీనిధి స్కూల్ మైదానంలో 3 టర్ఫ్ వికెట్లు, 2 ఆస్ట్రోటర్ఫ్ వికెట్లు, 2 మ్యాటింగ్ వికెట్లు, 2 సిమెంట్ వికెట్లు ఉన్నాయి. లక్ష్మణ్‌తో అకాడమీ ఏర్పాటు గురించి నాలుగేళ్ల క్రితమే చర్చించామని, ఇప్పుడు అది సాకారం అయిందని ఈ సందర్భంగా శ్రీనిధి చైర్మన్ డాక్టర్ మహి చెప్పారు. ఆర్థికంగా లాభదాయకం కాకపోయినా క్రికెట్‌పై ఉన్న అభిమానంతోనే వీవీఎస్ దీనిని ప్రారంభిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతోపాటు పలువురు మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. -
తణుకులో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ
తణుకు, న్యూస్‌లైన్: అంతర్జాతీయస్థాయి బ్యాడ్మిం టన్ ఆటగాళ్లను తీర్చి దిద్దిన పుల్లెల గోపీచంద్ అకాడమీ ఇప్పుడు తొలిసారి హైదరాబాద్ బయట ఏర్పాటు కాబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు గోపీచంద్ అధికారికంగా ప్రకటించారు. చిట్టూరి సుబ్బారావు-గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీగా దీనికి పేరుపెట్టారు. ఇక్కడ అకాడమీ నిర్వహణకు అవసరమైన కోచ్‌లు, సాంకేతిక నైపుణ్యం, సహకారం తదితరాలను గోపీచంద్ అకాడమీ పర్యవేక్షిస్తుంది. ఆర్థిక పరమైన సహకారం చిట్టూరి సుబ్బారావు బ్యాడ్మింటన్ ట్రస్ట్ అందజేస్తుంది. ఇందులో ప్రధానంగా 8-10 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులను ఎంపిక చేసి శిక్షణనిస్తారు. వచ్చే ఫిబ్రవరిలో సెలక్షన్స్ నిర్వహించి 25 మందిని ఎంపిక చేయనున్నారు. వచ్చే మార్చి నుంచి అకాడమీలో శిక్షణ ప్రారంభమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కూడా బ్యాడ్మింటన్‌ను చేరువ చేసి భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు గోపీచంద్ వెల్లడించారు. -
విజయవాడలో పీవీపీ-గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ!
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: భారత్‌కు బ్యాడ్మింటన్ హబ్‌గా మారిన హైదరాబాద్‌లోని నిమ్మగడ్డ ఫౌండేషన్ - గోపీచంద్ అకాడమీ తరహాలో విజయవాడలోనూ ఓ అకాడమీ ప్రారంభం కానుంది. ఐబీఎల్ చాంపియన్ హైదరాబాద్ హాట్‌షాట్స్ యజమాని ప్రసాద్ వి. పొట్లూరి దీనికి శ్రీకారం చుట్టారు. తన సొంత ఊరు విజయవాడను స్పోర్ట్స్ హబ్‌గా మార్చాలని ఉందని... ఇందులో భాగంగా తొలుత పీవీపీ-గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని నగరంలో ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. అలాగే కానూరులోని ప్రసాద్ వి.పొట్లూరి ఇంజినీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ హంగులతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. -
ఆటను మరింత మెరుగుపర్చుకోవాలి : సింధు
రాబోయే రోజుల్లో తన ఆటను మరింత మెరుగు పర్చుకోవాల్సి ఉందని, అప్పుడే పెద్ద విజయాలు తన ఖాతాలో చేరతాయని భారత బ్యాడ్మింటన్ యువ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గడం గర్వంగా అనిపిస్తోందని ఆమె చెప్పింది. వరల్డ్ చాంపియన్‌షిప్ అనంతరం నగరానికి చేరుకున్న సింధు... మంగళవారం గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడింది. ‘వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడం చాలా సంతోషంగా ఉంది. సెమీస్‌లో ఓడినా ఎలాంటి బాధా లేదు. ఇకపై నా ఆటలో లోపాలను సరిదిద్దుకొని మరింత మెరుగవ్వాలి. ప్రతీ మ్యాచ్ నాకు కఠినం కానుంది. నేను బాగా ఆడతాననే విశ్వాసంతో ఉన్నాను’ అని సింధు పేర్కొంది. రత్చనోక్ జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తాను ఎలాంటి ఒత్తిడినీ ఎదుర్కోలేదని, ప్రత్యర్థి బాగా ఆడటం వల్లే ఓడానని చెప్పింది. ‘నేను ఆరంభంలోనే కొన్ని తప్పులు చేయడంతో ఆమె భారీ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. నేను కొంత నెగెటివ్ గేమ్ ఆడాను. అయితే రత్చనోక్ చాలా బాగా ఆడటంతో నేను కోలుకోలేకపోయాను’ అని సింధు విశ్లేషించింది. సైనా అద్భుతమైన క్రీడాకారిణి అని, కోర్టులో ఆమె దూకుడు తనకిష్టమని ఈ యువ షట్లర్ అభిప్రాయ పడింది. తన విజయం పట్ల కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారని, ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించడం నాన్న రమణ నుంచే అలవాటైందని ఆమె చెప్పడం విశేషం. కోర్టులో సుదీర్ఘంగా సాధన చేయడాన్ని తాను ఇబ్బందిగా భావించడం లేదని, అది కోచ్ గోపీచంద్‌పైనే ఆధారపడి ఉంటుందని సింధు చెప్పింది. ‘నాకు ఎన్ని గంటల శిక్షణ ఇచ్చినా అది నా కోసమే. కాబట్టి ఇష్టంతోనే కష్ట పడుతున్నాను. అలా చేస్తేనే నా తప్పులను సరిదిద్దుకోగలను. భవిష్యత్తులో రత్చనోక్‌ను ఓడించాలంటే ఇది అవసరం. ఆట వల్ల నేనేమీ కోల్పోవడం లేదు. ప్రస్తుతం ఒక్కో టోర్నీలో ప్రదర్శనపై దృష్టి పెట్టాను. గోపీ సర్ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళతాను’ అని సింధు స్పష్టం చేసింది. ‘సైనా ఒలింపిక్ మెడల్ నెగ్గి సరిగ్గా ఏడాది అయింది. ఇప్పుడు సింధు రూపంలో మళ్లీ మేం సంబరాలు జరుపుకుంటున్నాం. అయితే సైనా విజయాన్ని దీంతో పోల్చడం నాకిష్టం లేదు. సింధు అద్భుతంగా ఆడింది. భవిష్యత్తులో ఈ ప్రదర్శన ఇంకా మెరుగవుతుంది. అద్భుతమైన ఫిట్నెస్ కూడా సింధు విజయంలో కీలక పాత్ర పోషించింది. చైనాను అడ్డుకునేందుకు ఇప్పుడు ప్రతీ దేశం వ్యూహాలు పన్నుతోంది. అప్పుడు మరో వైపునుంచి పోటీ ఎదురువుతుంది. థాయిలాండ్‌నుంచి ఇప్పుడు టాప్-20లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. బ్యాడ్మింటన్‌లో ఎక్కువగా దేశవాళీ టోర్నీలు లేకపోవడం వల్ల సైనా, సింధు ప్రత్యర్థులుగా తలపడే అవకాశం పెద్దగారాలేదు. ఇకపై అంతర్జాతీయ స్థాయిలో అది జరుగుతుంది. అయితే చివరకు భారత్‌కు పతకం రావడమే ముఖ్యం. ఆ దిశగా శ్రమిస్తున్నాం’ - పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ -
ఇకపై ప్రతీ మ్యాచ్ కఠినమే!
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో తన ఆటను మరింత మెరుగు పర్చుకోవాల్సి ఉందని, అప్పుడే పెద్ద విజయాలు తన ఖాతాలో చేరతాయని భారత బ్యాడ్మింటన్ యువ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గడం గర్వంగా అనిపిస్తోందని ఆమె చెప్పింది. వరల్డ్ చాంపియన్‌షిప్ అనంతరం నగరానికి చేరుకున్న సింధు... మంగళవారం గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడింది. ‘వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడం చాలా సంతోషంగా ఉంది. సెమీస్‌లో ఓడినా ఎలాంటి బాధా లేదు. ఇకపై నా ఆటలో లోపాలను సరిదిద్దుకొని మరింత మెరుగవ్వాలి. ప్రతీ మ్యాచ్ నాకు కఠినం కానుంది. నేను బాగా ఆడతాననే విశ్వాసంతో ఉన్నాను’ అని సింధు పేర్కొంది. రత్చనోక్ జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తాను ఎలాంటి ఒత్తిడినీ ఎదుర్కోలేదని, ప్రత్యర్థి బాగా ఆడటం వల్లే ఓడానని చెప్పింది. ‘నేను ఆరంభంలోనే కొన్ని తప్పులు చేయడంతో ఆమె భారీ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. నేను కొంత నెగెటివ్ గేమ్ ఆడాను. యితే రత్చనోక్ చాలా బాగా ఆడటంతో నేను కోలుకోలేకపోయాను’ అని సింధు విశ్లేషించింది. సైనా అద్భుతమైన క్రీడాకారిణి అని, కోర్టులో ఆమె దూకుడు తనకిష్టమని ఈ యువ షట్లర్ అభిప్రాయ పడింది. తన విజయం పట్ల కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారని, ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించడం నాన్న రమణ నుంచే అలవాటైందని ఆమె చెప్పడం విశేషం. కోర్టులో సుదీర్ఘంగా సాధన చేయడాన్ని తాను ఇబ్బందిగా భావించడం లేదని, అది కోచ్ గోపీచంద్‌పైనే ఆధారపడి ఉంటుందని సింధు చెప్పింది. ‘నాకు ఎన్ని గంటల శిక్షణ ఇచ్చినా అది నా కోసమే. కాబట్టి ఇష్టంతోనే కష్ట పడుతున్నాను. అలా చేస్తేనే నా తప్పులను సరిదిద్దుకోగలను. భవిష్యత్తులో రత్చనోక్‌ను ఓడించాలంటే ఇది అవసరం. ఆట వల్ల నేనేమీ కోల్పోవడం లేదు. ప్రస్తుతం ఒక్కో టోర్నీలో ప్రదర్శనపై దృష్టి పెట్టాను. గోపీ సర్ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళతాను’ అని సింధు స్పష్టం చేసింది. ‘సైనా ఒలింపిక్ మెడల్ నెగ్గి సరిగ్గా ఏడాది అయింది. ఇప్పుడు సింధు రూపంలో మళ్లీ మేం సంబరాలు జరుపుకుంటున్నాం. అయితే సైనా విజయాన్ని దీంతో పోల్చడం నాకిష్టం లేదు. సింధు అద్భుతంగా ఆడింది. భవిష్యత్తులో ఈ ప్రదర్శన ఇంకా మెరుగవుతుంది. అద్భుతమైన ఫిట్నెస్ కూడా సింధు విజయంలో కీలక పాత్ర పోషించింది. చైనాను అడ్డుకునేందుకు ఇప్పుడు ప్రతీ దేశం వ్యూహాలు పన్నుతోంది. అప్పుడు మరో వైపునుంచి పోటీ ఎదురువుతుంది. థాయిలాండ్‌నుంచి ఇప్పుడు టాప్-20లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. బ్యాడ్మింటన్‌లో ఎక్కువగా దేశవాళీ టోర్నీలు లేకపోవడం వల్ల సైనా, సింధు ప్రత్యర్థులుగా తలపడే అవకాశం పెద్దగారాలేదు. ఇకపై అంతర్జాతీయ స్థాయిలో అది జరుగుతుంది. అయితే చివరకు భారత్‌కు పతకం రావడమే ముఖ్యం. ఆ దిశగా శ్రమిస్తున్నాం’ -పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్