విరాట్ కోహ్లి, స్మిత్
లండన్ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ పట్ల దురుసుగా ప్రవర్తించిన భారత అభిమానులను మందలించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీడాస్పూర్తిని చాటుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై యావత్ క్రికెట్ ప్రపంచం కోహ్లిని కొనియాడగా.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ మాత్రం తప్పుబట్టాడు. భారత అభిమానులను మందలించే హక్కు కోహ్లికి ఎక్కడిదని ప్రశ్నించాడు. ‘వార్నర్, స్మిత్‌లను భారత అభిమానులు తిట్టకుండా ఆపే హక్కు కోహ్లికి ఉందా? వారు తప్పు చేసారు కాబట్టే అభిమానులు అంటున్నారు’ అని అభిప్రాయపడ్డాడు. అయితే నిక్ కాంప్టన్ కోహ్లిని తప్పుబట్టడాన్ని భారత్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీన్ని గ్రహించిన నిక్ కాంప్టన్ తన తప్పును సరిదిద్దుకుంటూ క్షమాపణలు తెలియజేసాడు. ‘కోహ్లి పట్ల నేను చేసిన అనాలోచిత వ్యాఖ్యలకు ఎవరైన బాధపడి ఉంటే క్షమించండి. నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. కోహ్లి చేసిన పని గొప్పది. వీటన్నిటిని పక్కనపెట్టి క్రికెట్‌ను ఆస్వాదించండి. మీ అభిప్రాయాలను నేను అభినందిస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు.
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘చీటర్, చీటర్’ అంటూ అభిమానులు గేలి చేశారు. కొద్దిసేపు దీనిని గమనించిన కోహ్లి, హార్ధిక్ పాండ్యా వికెట్ పడ్డ సమయంలో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ... అలా ప్రవర్తించవద్దంటూ మందలించాడు. స్మిత్ కోసం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ.. తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. అంతేకాకుండా అభిమానుల తరఫున స్మిత్‌కు క్షమాపణలు కూడా కోరాడు. అభిమానులను కోహ్లి మందలించడాన్ని చూసిన స్మిత్.. అభినందన పూర్వకంగా అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కోహ్లి చేసిన ఈ పనిపై ఐసీసీతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం హర్షించింది.
I’m sorry if people feel my comments regarding Virat Kohli were unfair... I’m sure it was harmless guys and his intentions were well meaning. Let’s enjoy the cricket and let the fans make their own minds up.. I appreciate your views let’s keep it friendly 😀
— Nick Compton (@thecompdog) June 11, 2019
Comments
Please login to add a commentAdd a comment