బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయిలు నిధి చిలుముల, శ్రీ వైష్ణవి పెద్దిరెడ్డి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నిధి 6-2, 7-5తో కర్మాన్ కౌర్ (భారత్)పై నెగ్గగా... వైష్ణవి 7-6 (7/2), 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి జి యావో వాంగ్ (చైనా) గాయం కారణంగా వైదొలిగింది.
మరో తెలుగు అమ్మాయి రిషిక సుంకర 6-3, 1-6, 6-2తో రష్మీ చక్రవర్తి (భారత్)ని ఓడించింది. డబుల్స్ క్వార్టర్స్‌లో నిధి-రుతుజా ద్వయం 6-0, 6-4తో రష్మీ చక్రవర్తి-కాల్వ భువన జోడిపై నెగ్గి సెమీఫైనల్లోకి చేరింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో రిషికతో వైష్ణవి; ఫాతిమా (ఒమన్)తో నిధి
తలపడతారు.
ఐటీఎఫ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో నిధి, వైష్ణవి
Published Thu, Aug 7 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement
Advertisement