
కార్డిఫ్: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ప్రారంభించిన టీమిండియా.. నేటి టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. శుక్రవారం కార్డిఫ్ వేదికగా జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో ఘనవిజయాన్ని సాధించిన కోహ్లి సేన అదే ఊపును కొనసాగించే అవకాశంఉంది. అయితే కార్డిఫ్ పిచ్ కాస్త నెమ్మదైనది కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు తక్కువ. రెండో మ్యాచ్ కోసం భారత్ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment