
బ్రిస్టల్: ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. మూడు టీ20ల సిరీస్‌ను 1-2తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఆల్‌రౌండ్ షోతో భారత ఆటగాళ్లు అదరగొట్టడంతో నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ హీరో రోహిత్ సెంచరీతో చెలరేగగా, హార్దిక్ పాండ్యా మెరవడంతో టీమిండియా ఘనవిజయం సాధించింది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విల్లే బౌలింగ్‌లో ధావన్(5) వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(19) కూడా విఫలమయ్యాడు.
ఈ సమయంలో విరాట్ కోహ్లి అండతో చెలరేగిపోయిన మరో ఓపెనర్ స్కోర్ బోర్డ్ పరిగెత్తించాడు. రోహిత్ శర్మ విధ్వంసంతో ఆతిథ్య జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యం కూడా చిన్నదయిపోయింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ 100 నాటౌట్ (56 బంతుల్లో 11 ఫోర్లు, 5సిక్సర్లు) సెంచరీ సాధించాడు. మరో వైపు వీలు చిక్కినప్పుడల్లా కోహ్లి 43(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌కు పనిచెప్పాడు. చివర్లో పాండ్యా 33 నాటౌట్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో మరో ఎనిమిది బంతులు మిగిలిండగానే టీమిండియా లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే, బాల్, జోర్డాన్ తలో వికెట్ సాధించారు.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్, బట్లర్ దాటిగా ఆడటంతో స్కోర్ 7 ఓవర్లలోనే 82 పరుగులకు చేరింది. 8 ఓవర్లో సిదార్థ్ కౌల్ బట్లర్(34)ను అవుట్ చేయడంతో పరుగుల దాటికి అడ్డుకట్ట పడింది. ఆ తర్వాత 103 పరుగుల వద్ద జాసన్(67) వెనుదిరగడంతో పరుగుల వేగం కాస్త తగ్గింది. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ హేల్స్ (30), బెయిర్‌స్టో(25), స్టోక్స్(14) పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కొల్పోయి 198 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా నాలుగు వికెట్లు, కౌల్ రెండు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, ఉమేశ్ యాదవ్‌లకు చెరో వికెటు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment