చండిమాల్‌కు ఉద్వాసన | No place for Test captain Dinesh Chandimal in Lankan ODI side | Sakshi

చండిమాల్‌కు ఉద్వాసన

Dec 5 2017 4:21 PM | Updated on Nov 9 2018 6:43 PM

No place for Test captain Dinesh Chandimal in Lankan ODI side - Sakshi

న్యూఢిల్లీ:భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును ఫాలో ఆన్‌ ప్రమాదం నుంచి కాపాడిన శ్రీలంక కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్‌ను వన్డే సిరీస్‌ నుంచి తప్పించారు. ఈ మేరకు మంగళవారం వన్డే సిరీస్‌కు ప్రకటించిన లంక జట్టు నుంచి చండిమాల్‌కు ఉద్వాసన పలికారు. భారత్‌తో మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో చండిమాల్‌ 164 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఆఖరిదైన మూడో టెస్టులో లంకేయులు కష్టాల్లో పడ్డ  సమయంలో చండిమాల్‌ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే భారత్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో మాత్రం చండిమల్‌ స్థానం దక్కించుకోలేకపోయాడు. ప్రధానంగా వన్డే సిరీస్‌కు సంబంధించి లంక సెలక్టర్ల నమ్మకాన్ని కోల్పోయిన చండిమాల్‌కు మొండిచేయే ఎదురైంది. కాగా, ఆల్‌ రౌండర్‌ ఆసేలే గుణరత్నే, ఓపెనింగ్‌ ఆటగాడు దనుష్క గుణతిలకా తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.

భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు ఇదే..

తిషారా పెరీరా(కెప్టెన్‌), ఉపుల్‌ తరంగా, దనుష్క గుణతిలకా, డిక్వెల్లా, సదీరా సమరవిక్రమా, లహిరు తిరుమన్నే, మాథ్యూస్‌, గుణరత్నే, చతురంగా డిసిల్వా, అకిలా దనంజయ, వాండార్సే, దిష్కమంత చమీరా, సురంగా లక్మల్‌, నువాన్‌ ప్రదీప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement