1975లో వన్డే ప్రపంచ కప్నకు అంకురార్పణ జరిగాక.. నేటి వరకు 11 ఈవెంట్లు జరిగాయి. ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలవగా.. వెస్టిండీస్, భారత్ చెరో రెండు సార్లు కప్ సొంతం చేసుకున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి జగజ్జేతలయ్యారు. ఈ ఐదు జట్లు మినహా ఇతర జట్లు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ నెగ్గలేదు. తాజా ఈవెంట్లో న్యూజిలాండ్ కొత్త చాంపియన్ అవుతుందని ఆశించనా.. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ కూడా వన్డే ప్రపంచ కప్ కల నెరవేరలేదు. ఇప్పటి వరకు జరిగిన 11 వన్డే ప్రపంచ కప్లలో ఎవరెవరు గెలిచారో చూద్దాం..
సంవత్సరం విజేత రన్నరప్
1975 వెస్టిండీస్ ఆస్ట్రేలియా
1979 వెస్టిండీస్ ఇంగ్లండ్
1983 భారత్ వెస్టిండీస్
1987 ఆస్ట్రేలియా ఇంగ్లండ్
1992 పాకిస్థాన్ ఇంగ్లండ్
1996 శ్రీలంక ఆస్ట్రేలియా
1999 ఆస్ట్రేలియా పాకిస్థాన్
2003 ఆస్ట్రేలియా భారత్
2007 ఆస్ట్రేలియా శ్రీలంక
2011 భారత్ శ్రీలంక
2015 ఆస్ట్రేలియా న్యూజిలాండ్
ప్రపంచ కప్ విజేతలు వీరే
Published Sun, Mar 29 2015 3:40 PM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM
Advertisement
Advertisement