
తొలి టి20లో పాక్ విజయం
దుబాయ్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో పాకిస్తాన్ జట్టు 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. పాక్ స్పిన్నర్ ఇమద్ వసీమ్ (5/14) ధాటికి... వెస్టిండీస్ 19.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటరుుంది. ఒక దశలో విండీస్ 48 పరుగులకే 8 వికెట్లు కోల్పోగా... డ్వేన్ బ్రేవో (54 బంతుల్లో 55; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నాడు. పాకిస్తాన్ జట్టు 14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 116 పరుగులు చేసి గెలిచింది.