తొలి టి20లో పాక్‌ గెలుపు | Pakistan win the first T20 | Sakshi
Sakshi News home page

తొలి టి20లో పాక్‌ గెలుపు

Published Tue, Mar 28 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

Pakistan  win the first T20

బ్రిడ్జ్‌టౌన్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆరు వికెట్లతో గెలిచింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే 18 ఏళ్ల పాక్‌ యువ లెగ్‌ స్పిన్నర్‌ షాదాబ్‌ ఖాన్‌ (3/7) అదరగొట్టాడు. మొదట వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 111 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం పాకిస్తాన్‌ జట్టు 17.1 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసి గెలిచింది. షోయబ్‌ మాలిక్‌ (29 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement