పాక్‌ ఘనవిజయం.. మాజీ క్రికెటర్ల ప్రశంసలు | Pakistan Won By 9 Wickets Against England | Sakshi
Sakshi News home page

Published Sun, May 27 2018 6:18 PM | Last Updated on Wed, Jul 25 2018 1:51 PM

Pakistan Won By 9 Wickets Against England - Sakshi

పాక్‌ ఆటగాళ్ల ఆనందం

లండన్‌: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో​ పాకిస్తాన్‌ 9 వికెట్ల తేడాతో​ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో 2 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. 235/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ మరో నాలుగు ఓవర్లు ఎదుర్కొని చాపచుట్టేసింది. కేవలం ఏడు పరుగులు మాత్రమే చేయడంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 242 పరుగులకు ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగుల ఆధిక్యం సాధించిన పాక్‌కు 64 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. ఈ లక్ష్యాన్ని పాక్‌ ఓ వికెట్‌ కోల్పోయి ఛేదించింది. పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ అమిర్‌, అబ్బాస్‌ నాలుగేసి వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించారు. షాదబ్‌ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

పాక్‌ విజయంపై మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదేశ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది, ముస్తాక్‌ అహ్మద్‌లు.. అమిర్‌, అబ్బాస్‌లను ప్రశంసిస్తూ.. ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక విజయం నమోదైందని పాక్‌ జిందాబాద్‌ అంటూ ట్వీట్‌ చేశారు. భారత క్రికెటర్‌ మహ్మద్‌ కైప్‌ సైతం పాక్‌ ఆటగాళ్లను అభినందించాడు. చాలా మంది ఆటగాళ్లు ఇంగ్లండ్‌ గడ్డపై తొలిసారి ఆడుతున్నా అద్భుత ప్రదర్శన రాణించారని కొనియాడాడు.

ఇంగ్లండ్‌ స్కోర్‌ 184 & 242

పాకిస్తాన్‌ 363 & 66/1

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement