దుబాయ్: శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 145 పరుగులు చేసింది.
మాథ్యూస్ (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. తన్వీర్, అజ్మల్ చెరో రెండు, ఆఫ్రిది ఒక్క వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసి గెలిచింది. ఆఫ్రిది (20 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. షార్జిల్ ఖాన్ (31 బంతుల్లో 34; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.
తొలి టి20లో పాక్ గెలుపు
Published Fri, Dec 13 2013 1:32 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement
Advertisement