శ్రీలంక గెలుపు | srilanka team won second one day international | Sakshi
Sakshi News home page

శ్రీలంక గెలుపు

Published Sun, Dec 22 2013 3:04 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

srilanka team won  second one day international

దుబాయ్: బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించిన శ్రీలంక... పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 284 పరుగులు చేసింది. అహ్మద్ షెహజాద్ (140 బంతుల్లో 124; 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసి గెలిచింది.

 సంగక్కర (67 బంతుల్లో 58; 4 ఫోర్లు, 1 సిక్సర్), చండిమాల్ (57 బంతుల్లో 44; 1 సిక్సర్), దిల్షాన్ (48 బంతుల్లో 40; 6 ఫోర్లు), మాథ్యూస్ (44 బంతుల్లో 47; 2 ఫోర్లు) తలా కొన్ని పరుగులు జత చేశారు. ఆఖరి ఓవర్‌లో నాలుగు పరుగులు చేయాల్సిన దశలో ఆఫ్రిది బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన సేననాయకే జట్టుకు విజయాన్ని అందించాడు. జునైద్ 3, ఆఫ్రిది 2 వికెట్లు తీశారు. మాథ్యూస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement