
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. ఇక భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఖలీల్ అహ్మద్, శార్ధుల్ టాకుర్ స్థానాల్లో జస్‌ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యాలు జట్టులోకి వచ్చారు. పాక్ ఎలాంటి మార్పుల్లేకుండా హాంకాంగ్‌తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.
టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్నామని భారత కెప్టెన్ రోహిత్ తెలిపాడు. అయినప్పటికి ఛేజింగ్‌ను స్వీకరిస్తున్నామని, నిన్న హాంకాంగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగే చేశామన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఇరు జట్లు తలపడుతుండటంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. విరాట్ కోహ్లి గైర్హాజరితో బరిలోకి దిగుతున్న భారత్ ఎలాగైనా మ్యాచ్ గెలవాలని భావిస్తోంది. గత కొన్ని రోజులుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న పాక్ ఈ మ్యాచ్‌ను సైతం గెలిచి తమ విజయయాత్రను కొనసాగించాలని ఉవ్విళ్లురుతోంది.
తుది జట్లు
భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాయుడు, ధోని, కార్తిక్, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్,బుమ్రా, చహల్, కుల్‌దీప్
పాకిస్తాన్: ఇమామ్, ఫకార్, బాబర్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, షాదాబ్, ఫహీమ్, ఆమిర్, హసన్, ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment