పాండ్యాకు చురకలంటించిన నెటిజన్లు.. | Pandya Focus On Cricket, Says twitter | Sakshi
Sakshi News home page

పాండ్యాకు చురకలంటించిన నెటిజన్లు..

Published Wed, Sep 6 2017 11:10 AM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM

పాండ్యాకు చురకలంటించిన నెటిజన్లు..

పాండ్యాకు చురకలంటించిన నెటిజన్లు..

కొలంబో: భారత యువ ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్యా బాలీవుడ్‌ నటి పరిణితి చోప్రాతో జరిపిన ట్విట్టర్‌ చాటింగ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఫస్ట్‌ ఆటపై దృష్టి సారించు అంటూ సోషల్‌ మీడియా వేదికగా చురకలంటిస్తున్నారు. ఇటీవల ఓ సైకిల్ ఫోటోను పోస్ట్ చేసిన పరిణితి.. అమేజింగ్ పార్టనర్‌తో ఫర్‌ఫెక్ట్ ప్రయాణం కోరుకుంటున్నట్లు... ఓ సందేశం ఉంచారు. దీనికి వెంటనే స్పందించిన క్రికెటర్‌ హర్ధిక్ బహుశా ఇది బాలీవుడ్‌ క్రికెట్ లింకులో రెండోదేమో అంటూ ఓ రిప్లై ఇచ్చారు. 
 
దీనికి పరిణితి తానేం సమాధానం చెప్పలేనంటూ దాటవేశారు. దీంతో పరిణితి చోప్రా-క్రికెటర్‌ హర్థిక్ పాండ్యాల మధ్య ఏదో నడుస్తుందంటూ కొన్ని రోజులుగా పుకార్లు పుట్టుకొచ్చాయి. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ప్రేమాయణం నడుస్తుందంటూ బాలీవుడ్ మీడియా కథనాలు కూడా రాసేసింది. వ్యవహారం బాగా ముదిరిపోవటంతో పరిణితి ఓ ట్విట్టర్ వీడియోలో తన సందేశం ఉంచారు. జియోమీ కొత్త ఫోన్‌ 5ఎక్స్‌ ప్రచారంలో భాగంగానే తాను పార్టనర్‌ ట్వీట్‌ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.
 
అయితే ఇప్పుడిప్పుడే జట్టులో కుదురుకుంటున్న పాండ్యాకు ఇదంతా అవసరమా అని ఆటపై దృష్టి సారిస్తే బాగుంటుందని ట్వీటర్‌ వేదికగా క్రికెట్‌ అభిమానులు హితవు పలుకుతున్నారు. ఇప్పటికే తన హెయిర్‌స్టైల్‌పై మాజీ క్రికెటర్‌ గవాస్కర్‌ సెటైర్లు వేయగా తాజా పరిణామం మరింత చర్చనీయాంశమైంది. లంక పర్యటనలో టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన పాండ్యా సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే.  ఈ సెంచరీ అనంతరం సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ త్వరలోనే మరో కపిల్‌దేవ్‌ను చూసే రోజులు వచ్చాయి అంటూ పాండ్యాను ఆకాశానికెత్తారు. ఇక పాండ్యా 7 సిక్సులతో ఈసెంచరీ చేయడం విశేషం. చివరి వన్డేకు దూరమైన పాండ్యా చివరి ఏకైక టీ20 మ్యాచ్‌కు జట్టులోకి రానున్నారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement