
కష్టాల్లో పంజాబ్
ఐపీఎల్ - 8 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది.
మొహాలీ: ఐపీఎల్ - 8 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. పంజాబ్ జట్టు 35 పరుగులకే ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(16) , మనన్ వోహ్రా(4) లతో పాటు కెప్టెన్ జార్జీ బెయిలీ (12) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పంజాబ్ స్కోరు 16 పరుగుల వద్ద సాహా వికెట్ కోల్పోయిన వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది.
రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షాట్ ఆడటానికి క్రీజు వదిలి వెళ్లిన గురుకీరత్ సింగ్ (15)ను చెన్నై కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ స్టంపౌట్ చేశాడు. పదో ఓవర్లో గ్లెన్ మాక్స్ వెల్ (6) రవీంద్ర జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అశ్విన్, ఆశీష్ నెహ్రా, ఈశ్వర్ పాండే, పవన్ నేగి, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.